శనివారం 24 అక్టోబర్ 2020
Medak - Oct 03, 2020 , 05:09:03

స్థిరాస్తుల నమోదు సర్వేను వేగవంతం చేయాలి

స్థిరాస్తుల నమోదు సర్వేను వేగవంతం చేయాలి

సర్పంచ్‌లు, వార్డు సభ్యులు సహకరించాలి 

రాష్ట్ర పంచాయతీరాజ్‌ డిప్యూటీ కమిషనర్‌ రవీంద్ర

మనోహరాబాద్‌: స్థిరాస్తుల సర్వేను వేగవంతం చేయాలని, ప్రతి ఇంటికి తిరిగి కొలతలు, ఆస్తుల వివరాలను సేకరించాలని రాష్ట్ర పంచాయతీరాజ్‌ డిప్యూటీ కమిషనర్‌ రవీంద్ర అన్నారు. మనోహరాబాద్‌ మండలం కూచారం, మనోహరాబాద్‌ గ్రామాల్లో కొనసాగుతున్న స్థిరాస్తుల సర్వేను శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి వ్యక్తి వివరాలు, ఆస్తి, కుటుంబసభ్యుల వివరాలను సేకరించి ఆన్‌లైన్‌లో పొందపరుస్తామన్నారు. దీంతో ప్రతి వ్యక్తి ఆస్తిపాస్తుల వివరాలు పక్కాగా ఉంటాయని, ప్రభుత్వం, బ్యాంకుల నుంచి రుణాలు వచ్చే అవకాశం ఉంటుందన్నారు. వీటితో పాటు దేవాలయాలు, ప్రభుత్వ కార్యాలయాల వివరాలను సేకరిస్తామన్నారు. పరిశ్రమ వద్ద కార్మికుల కోసం నిర్మించే షెడ్డులను సైతం ఆన్‌లైన్‌లో నమోదు చేస్తామన్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో సర్పంచ్‌లు, వార్డు మెంబర్లు సర్వేకు సహకరించాలన్నారు. వ్యక్తి ఆధార్‌కార్డు, ఫోన్‌ నెంబర్‌, ఆస్తుల వివరాలను పక్కాగా ఆన్‌లైన్‌ చేయాలని సూచించారు. ఆయన వెంట డీఎల్‌పీవో వరలక్ష్మి, సర్పంచ్‌లు నరేందర్‌రెడ్డి, మహిపాల్‌రెడ్డి తదితరులు ఉన్నారు. 

logo