ఆదివారం 25 అక్టోబర్ 2020
Medak - Oct 03, 2020 , 05:10:09

యువత క్రీడల్లో రాణించాలి

యువత క్రీడల్లో రాణించాలి

రామాయంపేట:  యువత  క్రీడల్లో రాణించాలని  జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి నాగరాజు అన్నారు. శుక్రవారం  పట్టణంలోని పాత జాతీ య రహదారిలో జాతీయ సైక్లింగ్‌ క్రీడాకారుడు దండు యాదగిరి, బ్యాడ్మింటన్‌ చైర్మన్‌ ఎస్‌కే హైమద్‌, ప్రముఖ హాకీ క్రీడాకారుడు బొంతల సత్యనారాయణలతో కలిసి  2కే రన్‌ను ప్రారంభించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి క్రీడాకారుడికి శారీరక శ్రమ చాలా ముఖ్యమన్నారు..ఈ కార్యక్రమంలో పీఈటీ ప్రశాంత్‌, జీవన్‌, శేఖర్‌, శివ తదితరులున్నారు.

logo