శనివారం 24 అక్టోబర్ 2020
Medak - Oct 03, 2020 , 05:09:54

బాధిత కుటుంబాలకు ఆర్థికసాయం

బాధిత కుటుంబాలకు  ఆర్థికసాయం

మనోహరాబాద్‌ : లాక్‌డౌన్‌ సమయంలో పాఠశాలలు లేకపోవడంతో చిన్న పిల్లలు తిరుగుతుంటారని, తల్లిదండ్రులు వారిని కనిపెడుతూ ఉండాలని ఫుడ్స్‌ మాజీ  చైర్మన్‌ గంగుమల్ల ఎలక్షన్‌రెడ్డి అన్నారు. మండలంలోని దండుపల్లి పంచాయతీ పరిధిలోని పిట్టల వాడకు చెందిన నవీన్‌, అఖిల, రవి గురువారం చెరువులో పడి మృతి చెందారు.  వారి కుటుంబాలను ఆయన శుక్రవారం పరామర్శించి  మృతుల కుటుంబాలకు రూ. 15 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో రైతుబంధు సమితి మండల కో ఆర్డినేటర్‌ సుధాకర్‌రెడ్డి, వైస్‌ ఎంపీపీ విఠల్‌రెడ్డి, నాయకులు ప్రభాకర్‌రెడ్డి, పంజా భిక్షపతి  పాల్గొన్నారు. 

logo