ఆదివారం 25 అక్టోబర్ 2020
Medak - Sep 29, 2020 , 23:25:46

టీఆర్‌ఎస్‌ పాలనలో రైతే రాజు

టీఆర్‌ఎస్‌ పాలనలో రైతే రాజు

  • సంక్షేమంలో తెలంగాణ నెంబర్‌ వన్‌
  • రైతు, పేదల సంక్షేమమే సర్కారు లక్ష్యం
  • ఆర్థిక మంత్రి హరీశ్‌రావు
  • దుబ్బాకలో చెక్కుల పంపిణీ

దుబ్బాక : ‘ టీఆర్‌ఎస్‌ పాలనలో రైతే రాజు.. ఇప్పుడు టీఆర్‌ఎస్‌ సర్కారు ఎకరానికి రూ.10వేల చొప్పున రైతుకు సాయం అందిస్తున్నది.. సంక్షేమ పథకాలు అమలులో దేశంలోనే ‘తెలంగాణ’ నెంబర్‌ వన్‌గా నిలిచింది.. కరోనా కష్ట కాలంలోనూ అన్ని సంక్షేమ పథకాలను కొనసాగించిన ఘనత టీఆర్‌ఎస్‌ సర్కారుకే దక్కింది’.. అని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. మంగళవారం దుబ్బాక రెడ్డి సంఘంలో దుబ్బాక, మిరుదొడ్డి, తొగుట, దౌల్తాబాద్‌, రాయపోల్‌ మండలాలకు చెందిన 315 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌, 14మందికి సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడారు. 12 రాష్ర్టాల్లో బీజేపీ, 5 రాష్ర్టా ల్లో కాంగ్రెస్‌ అధికారంలో ఉందని, ఆ రాష్ర్టాల్లో లేని సం క్షేమ పథకాలు తెలంగాణలో సీఎం కేసీఆర్‌ అమలు చేస్తున్నారన్నారు. ప్రతి ఇంటికీ తాగునీరు, ప్రతి ఎకరాకు సా గునీరు అందిస్తున్నామన్నారు. కల్యాణలక్ష్మి పథకం ద్వా రా పేదింటి ఆడబిడ్డ పెండ్లికి రూ.లక్షా 116 ప్రభుత్వ స హాయం అందిస్తున్నామన్నారు. కాంగ్రెస్‌, బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఆడబిడ్డ పెండ్లికి ఒక్క రూపాయి కూడా ఇవ్వ డం లేదన్నారు. కరోనా కష్టకాలంలో మంత్రుల, ఎమ్మెల్యేలకు 75శాతం(బారాణ), ప్రభుత్వ ఉద్యోగులకు జీతా ల్లో 50శాతం(ఆఠాణ) కోసిందే గానీ, పేదలకు మాత్రం అన్ని సంక్షేమ పథకాలు అమలు చేసిందని గుర్తు చేశారు. మూడేండ్లలో 7లక్షల మంది పేదింటి ఆడబిడ్డల పెండ్లికి రూ.5555 కోట్లు సహాయం అందించిందన్నారు. 

రైతు సంక్షేమమే సీఎం కేసీఆర్‌ లక్ష్యం

గతంలో భూమి ఉన్న రైతులు సర్కారుకు శిస్తు(రకం) కట్టేవారని, ఇప్పుడు టీఆర్‌ఎస్‌ సర్కారు ఎకరానికి రూ.10వేల చొప్పున రైతుకే శిస్తు అందిస్తున్నదని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. దేశంలో కేవలం తెలంగాణలోనే రైతుబంధు పథకాన్ని సీఎం కేసీఆర్‌ అమలు చేస్తున్నారన్నారు. 70ఏండ్లు కాంగ్రెస్‌, టీడీపీ ప్రభుత్వాలు చేయలేని అభివృద్ధి, సంక్షేమ పథకాలు కేవలం మూడేండ్లలో సీఎం కేసీఆర్‌ చేసి చూపించారన్నారు. టీఆర్‌ఎస్‌ సర్కారు రైతు సంక్షేమం కోసం కృషి చేస్తుంటే, కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కారు రైతులను క్షోభకు గురి చేసే విధానాలను అవలంబిస్తున్నదని మండిపడ్డారు. రైతు బోర్లకు మీటర్లు పెట్టేందుకు బీజేపీ సర్కారు సీఎం కేసీఆర్‌కు రూ.2500 కోట్ల ఆఫర్‌ ఇచ్చిందని, రైతుల కోసం సీఎం కేసీఆర్‌ ఆ ఆఫర్‌ను తిరస్కరించారని గుర్తు చేశారు. ప్రతి ఇంటికీ తాగు, ప్రతి ఎకరాకు సాగు నీరని, ఇదే తమ టీఆర్‌ఎస్‌ నినాదమన్నారు. జిల్లాలో ‘కాళేశ్వరం’ నీళ్లు పుష్కలంగా ఉన్నాయని, త్వరలోనే దుబ్బాక నియోజకవర్గంలో ప్రతి ఎకరాకు సాగు నీరు అందుతుందన్నారు. దుబ్బాకలో దివంగత ఎమ్మెల్యే రామలింగారెడ్డి అకాల మృతితో ఉప ఎన్నికలు అనివార్యమైనందున, భారీ మెజార్టీతో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిని గెలిపించుకోవాలని కోరారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో కొత్తకొత్త ముఖాలతో ప్రజల వద్దకు వస్తున్నారని, కనీసం దుబ్బాక నియోజకవర్గంలో.. గ్రామాల పేర్లు.. అవి ఎక్కడున్నాయో తెలియని వారు పోటీ చేసేందుకు వస్తున్నారని ఎద్దేవా చేశారు. మన ఆపద, సంపదలో రాని నాయకులు, ఎన్నికల సమయమైనందున ఇప్పుడు వస్తున్నారని, వారి మాయ మాటలు నమ్మి మోసపోవద్దని సూచించారు. ఉప ఎన్నికల్లో లక్ష మెజార్టీయే లక్ష్యంగా ప్రజలంతా ఆశీర్వదించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో  టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులు రొట్టే రాజమౌళి, దుబ్బాక మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ వనిత, ఎంపీపీలు, జడ్పీటీసీలు, దుబ్బాక, మిరుదొడ్డి పీఏసీఎస్‌ చైర్మన్లు బక్కి వెంకటయ్య, కైలాశ్‌, కౌన్సిలర్లు, ఎంపీటీసీ, సర్పంచ్‌లు తదితరులు పాల్గొన్నారు.

టీఆర్‌ఎస్‌కు ‘ఎరుకల’ ఏకగ్రీవ తీర్మానం

తెలంగాణలో బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసమే సీఎం కేసీఆర్‌ పలు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని, వాటిని వినియోగించుకొని అభివృద్ధి చెందాలని మంత్రి హరీశ్‌రావు సూచించారు. మంగళవారం దుబ్బాకలో తెలంగాణ ప్రదేశ్‌ ఎరుకల సంఘం ఆత్మీయ సమ్మేళనానికి మంత్రి హరీశ్‌రావు ముఖ్యఅతిథిగా హాజరై, మాట్లాడారు. పేదల సంక్షేమమే లక్ష్యంగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పని చేస్తున్నదన్నారు. ఎరుకల సంక్షేమం కోసం తమవంతుగా కృషి చేస్తామన్నారు. సంచార జాతులు, ఎస్సీ, ఎస్టీలు విద్య, ఉద్యోగ, రాజకీయంగా రాణించాలని తెలిపారు. ఎరుకలకు పందుల పెంపకం కోసం ప్రత్యేక పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ, ఎరుకల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు కుతాడి రాములు, అధ్యక్షుడు కృష్ణ, సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు మురళి, కార్యదర్శి సాయి, దుబ్బాక కౌన్సిలర్‌ రజిత, నాయకులు పోశయ్య, భిక్షపతి, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.


logo