శనివారం 31 అక్టోబర్ 2020
Medak - Sep 27, 2020 , 02:13:50

ఐలమ్మకు ఘన నివాళులు

ఐలమ్మకు ఘన నివాళులు

మెదక్‌ రూరల్‌: తెలంగాణ సోయుధ పారాట యోధురాలు  చాకలి ఐలమ్మ 125వ జయంతి పురస్కరించుకొని శుక్రవారం మండల పరిధిలోని శివ్వాయిపల్లిలో రజక సంఘం ఆధ్వర్యంలో ఐలమ్మ చిత్రపటానికి పూలమాలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం నాయకులు వెంకటేశ్‌, సాయిలు, శేఖర్‌, విజయ్‌లతో పాటు టీఆర్‌ఎస్‌ నాయకులు కిష్టయ్య, రవీందర్‌ గ్రామస్తులు  పాల్గొన్నారు. 

పాపన్నపేట మండలంలో జయంతి 

పాపన్నపేట: మండల కేంద్రమైన పాపన్నపేటతో పాటు మండల పరిధిలోని మిన్పూర్‌ గ్రామాల్లో తెలంగాణ సాయుధ పోరాటాన్ని ముందుండి నడిపించిన చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో చాకలి భూమేశ్‌, గోపాల్‌, శివకుమార్‌, ప్రభు వెంకటేశం, శ్రీశైలంతో పాటు స్థానిక సర్పంచ్‌ గురుమూర్తిగౌడ్‌, రైతు బంధుసమితి మండల అధ్యక్షుడు గడీల శ్రీనివాస్‌రెడ్డి మిన్పూర్‌ సర్పంచ్‌ లింగారెడ్డి ఆ గ్రామ ఎంపీటీసీ సభ్యులు కుభేరుడు తదితరులు పాల్గొన్నారు.