బుధవారం 28 అక్టోబర్ 2020
Medak - Sep 26, 2020 , 02:08:15

మత్స్యకారుల జీవనోపాధికి చర్యలు

మత్స్యకారుల జీవనోపాధికి  చర్యలు

  •  రైతుల కోసమే కొత్త రెవెన్యూ చట్టం
  • అందోల్‌ ఎమ్మెల్యే క్రాంతికిరణ్‌

టేక్మాల్‌: మత్స్యకారుల జీవనోపాధికి చేపల పెంపకం కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అందోల్‌ ఎమ్మెల్యే క్రాంతికిరణ్‌ అన్నారు.  మండల పరధిలోని కాదులూర్‌, తంపులూర్‌, టేక్మాల్‌, వేల్పుగొండ, పల్వంచ గ్రామాల పరిధిలోని చెరువుల్లో 5.25లక్షల చేప పిల్లలను వదిలారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ వర్షాలు సంమృద్ధిగా కురయడంతో చెరువులు నిండి జలకళను సంతరించుకున్నాయన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మత్స్యశాఖ జిల్లా అధికారి శ్రీనివాస్‌, జడ్పీటీసీ సరోజ, ఎంపీపీ స్వప్న,  సర్పంచ్‌లు యాదయ్య, సంగయ్య, సుప్రజా, నారాయణ, శివకుమార్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు వీరప్ప, ప్రధానకార్యదర్శి అవినాశ్‌, నాయకులు బసంతరావు, శ్రీధర్‌రెడ్డి, భాస్కర్‌, సత్యం, శ్రీనివాస్‌, మల్లేశం,  శ్రీనివాస్‌  ఉన్నారు.

పల్లె ప్రకృతి వనాలతో ఆహ్లాదం

 పల్లె ప్రకృతి వనాల ఏర్పాట్లు పచ్చదనంతో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంటుందని ఎమ్మెల్యే క్రాంతికిరణ్‌ అన్నారు. కాదులూర్‌ గ్రామంలో పల్లె ప్రకృతి వనంలో మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా మొక్కల సంరక్షణకు చర్యలు తీసుకోవాలని సూచించారు.  పల్వంచ గ్రామంలో కొత్త పట్టాదారు పాసు పుస్తకాలను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతుల శ్రేయస్సు కోసం కొత్త రెవెన్యూ చట్టాన్ని సీఎం కేసీఆర్‌ తీసుకోచ్చారని తెలిపారు. అలాగే వ్యవసాయేతర భూములు ఉన్నవారికి సైతం పాసుపుస్తకాలు ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రణాళికలను రూపొందిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ గ్రేసీబాయి, ఎంపీడీవో హిరణ్మయి, ఏపీవో పౌలు తదితరులు ఉన్నారు.logo