సోమవారం 26 అక్టోబర్ 2020
Medak - Sep 26, 2020 , 02:08:41

ఐక్యతకు నిదర్శనం.. ‘జాతీయ అవారు’్డ

 ఐక్యతకు నిదర్శనం.. ‘జాతీయ అవారు’్డ

  • l  పెద్దలింగారెడ్డిపల్లికి గ్రామీణ దీన్‌ దయాళ్‌  స్వశక్తీకరణ్‌ పురస్కారం
  • l  ప్రదానం చేసిన   మంత్రి  తన్నీరు హరీశ్‌రావు 

సిద్దిపేట రూరల్‌ :  పెద్దలింగారెడ్డిపల్లి గ్రామానికి కేంద్రస్థాయిలో గ్రామీణ దీన్‌దయాళ్‌ స్వశక్తీకరణ్‌ పురస్కారం రావడం గ్రామస్తుల ఐక్యతకు నిదర్శమని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. జూన్‌ 16న కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జాతీయస్థాయి అవార్డుల్లో పెద్దలింగారెడ్డిపల్లి  గ్రామీణ దీన్‌ దయాల్‌ స్వశక్తీకరణ్‌ పురస్కారానికి ఎంపికయ్యింది.  కరో నా దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం నేరుగా అవార్డులను అందించిలేక రాష్ర్టాలకు పంపింది. ఈ క్రమంలో శుక్రవారం సిద్దిపేటలోని తన నివాసంలో గ్రామపంచాయతీ పాలకవర్గానికి మంత్రి అవార్డు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. ఇప్పటికే రాష్ట్ర, జాతీయ స్థాయిలో పెద్దలింగారెడ్డిపల్లి పలు అవార్డులను దక్కించుకుందన్నారు.  అవా ర్డు సాధించినందుకు సర్పంచ్‌ ఉదయశ్రీ తిరుపతి, ఎంపీపీ శ్రీదేవి రామచందర్‌రావు, ఉప సర్పంచ్‌ సుగుణ రాజిరెడ్డి, వార్డు సభ్యులు, గ్రామస్తులకు శుభాకాంక్షలు తెలిపారు.  ఈ  కార్యక్రమంలో సుడా చైర్మన్‌ మారెడ్డి రవీందర్‌రెడ్డి, జడ్పీటీసీ శ్రీహరిగౌడ్‌, రైతుబంధు సమతి మండల కోఆర్డినేటర్‌ మోహన్‌రెడ్డి, మాజీ ఎంపీటీసీ సత్యనారాయణ, మాజీ ఉప సర్పంచ్‌ చంద్రారెడ్డి, స్థానిక నాయకులు పాల్గొన్నారు. logo