గురువారం 29 అక్టోబర్ 2020
Medak - Sep 25, 2020 , 02:28:45

ఆహ్లాదం కోసమే.. ప్రకృతి వనాలు

ఆహ్లాదం కోసమే..  ప్రకృతి వనాలు

  • గ్రామ పంచాయతీల్లో జోరుగా పనులు l పర్యవేక్షిస్తున్న అధికారులు

మెదక్‌ రూరల్‌: పల్లె ప్రజల ఆహ్లాదకరమైన వాతావరణం కోసమే ప్రభుత్వం పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఊరూరా భూమిని ఎంపిక చేసి వీటిని ఏర్పాటు చేస్తున్నది. మండలంలోని 19 గ్రామపంచాయతీలో జాతీయ ఉపాధి హామీ పథకం, పంచాయతీరాజ్‌ శాఖల అనుసంధానంతో పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేస్తున్నారు.  అధికారులు ఆయా గ్రామాల్లో ప్రభుత్వ భూమిని ఎంపిక చేసి పనులు ప్రారంభించారు. ప్రకృతి వనాల పనులు జోరుగా సాగుతున్నాయి. పల్లెప్రకృతి వనాల పనులను ఎంపీడీవో, ఉపాధిహామీ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. మొక్కలను సంరక్షించడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు.  

ఈజీఎస్‌ నుంచి నిధులు 

పల్లెల్లో ప్రకృతి వనాలను ఏర్పాటుకు ప్రభుత్వం ఈజీఎస్‌  నిధులు మంజూరు చేస్తోంది. ప్రతి గ్రామ పంచాయతీలో ప్రకృతి వనాల కోసం ఒక్కో గ్రామ పంచాయతీకి రెండు విడుతలుగా మొత్తం రూ.6.23 లక్షలను అందిస్తోంది. మొదటి సంవత్సరం రూ.3.95 లక్షలు, రెండో సంవత్సరం రూ.2.28 లక్షలు అందించనున్నది.