గురువారం 29 అక్టోబర్ 2020
Medak - Sep 24, 2020 , 01:39:14

రైతుల పొట్ట కొట్టేలా కేంద్రం బిల్లు

రైతుల పొట్ట కొట్టేలా  కేంద్రం బిల్లు

  • l  పార్లమెంట్‌లో కరెంట్‌ బిల్లును అడ్డుకునే శక్తి రఘునందన్‌ రావుకు ఉందా?
  • l  రక్షక్‌ యూనివర్సిటీని తెలంగాణకు తేకుండా గుజరాత్‌లో భూమి పూజ చేసిన కిషన్‌రెడ్డి
  • l  రైతులకు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న రైతు బాంధవుడు సీఎం కేసీఆర్‌
  • l  మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి 

మిరుదొడ్డి : రైతులు ఆర్థికంగా ఎదగాలనే లక్ష్యంతోనే సీఏం కేసీఆర్‌ పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తుంటే, దేశ ప్రధామంత్రి నరేంద్రమోదీ మాత్రం రైతుల పొట్టలు కొట్టేలా జీవోలు పార్లమెంట్‌లో తీసుకొస్తున్నారని మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌ రైతులకు ఎలాంటి భూమస్యలను ఉండకుండా తీసుకొచ్చిన నూతన రెవెన్యూ చట్టానికి మద్దతు తెలుపుతూ రైతులు బుధవారం సిద్దిపేట జిల్లా మిరుదొడ్డిలో సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే, ఉపఎన్నికల మిరుదొడ్డి మండల ఇన్‌చార్జి చింతా ప్రభాకర్‌తో కలిసి 200 ట్రాక్టర్లతో ర్యాలీని నిర్వహించారు. దీనికి ముఖ్యతిథిగా హాజరైన ఎంపీ, రైతులకు కృతజ్ఞతలు తెలిపి, మాట్లాడారు. ప్రధాన మంత్రి నరంద్రమోదీ రైతులను నట్టేటా ముంచే బిల్లును రాత్రికిరాత్రే పార్లమెంట్‌ ప్రవేశ పెట్టారని మండిపడ్డారు. కేంద్రంలో బీజేపీ పార్టీకి సంఖ్యా బలం ఉందని ఇష్టారీతిగా పార్లమెంట్‌లో బిల్లులు తీసుకొస్తూ, రైతుల నోట్లో మట్టి కొడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

  బోరను బావులకు మీటర్లను బిగిస్తున్న బీజేపీ 

సీఏం కేసీఆర్‌ వ్యవసాయ రంగానికి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగవద్దనే లక్ష్యంతోనే 24 గంటల పాటు ఉచిత విద్యును సరఫరా చేస్తుంటే, కేంద్ర కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మాత్రం విద్యుత్‌ను రైతులకు వ్యవసాయ రంగానికి ఉచితంగా సరఫరా చేయకుండా అడ్డుకుంటూ ప్రైవేట్‌ కంపెనీలకు విద్యుత్‌ వ్యవస్థను కట్టబెట్టి లాభాలను చేకుర్చుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రంలో బీజేపీ చేపడుతున్న ప్రజా వ్యతిరేక విధాలను అడ్డుకునే శక్తి రఘునందన్‌ రావుకు ఉందా? అని ప్రశించారు. ‘ప్రజలకు కల్లబొల్లి మాటలను చెప్పడం కాదు.. రఘునందన్‌ రావు.. నీకు దమ్ము.. ధైర్యం ఉంటే, రైతుల పొట్టల కొట్టే కరెంటు బిల్లును కేంద్రంలో ఆపు’.. అని సూటిగా నిలదీశారు.  

  రక్షక్‌ యూనివర్సిటీకి గుజరాత్‌లో  భూమి పూజ చేసిన కిషన్‌రెడ్డి

‘కిషన్‌ రెడ్డి.. రక్షక్‌ యూనివర్సిటీని తెలంగాణకు తీసుకరాకుండా, గుజరాత్‌ రాష్ట్రంలో కొబ్బరి కాయాలు కొట్టి, అక్కడే భూమి పూజ ఎందుకు చేశారు’.. అని ఎంపీ కేపీఆర్‌ నిలదీశారు. నరేంద్ర మోదీ చేతిలో కిషన్‌రెడ్డి కీలు బొమ్మగా మారబట్టే, గుజరాత్‌కు రక్షక్‌ యూనివర్సిటీని తీసుకెళ్లారనన్నారు. దుబ్బాకలో బీజేపీలో మూడు ముక్కలాట నడుస్తున్నదన్నారు. 

  దుబ్బాకలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థికి లక్ష ఓట్ల మెజార్టీ ఖాయం

బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు ఉప ఎన్నికల్లో ఎన్ని నాటకాలాడినా, చింతమడకలో పుట్టి, దుబ్బాకలో చదివిన ఇక్కడి బిడ్డా సీఎం కేసీఆర్‌ కారు గుర్తుకే ఓటు వేసి ఆశీర్వదించాలని కోరారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థికి లక్ష్య ఓట్ల మెజార్టీని ప్రజలు కట్టబెట్టాలని విజ్ఞప్తి చేశారు.