సోమవారం 19 అక్టోబర్ 2020
Medak - Sep 24, 2020 , 01:39:14

సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి బీడీ కార్మికుల క్షీరాభిషేకం

 సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి  బీడీ కార్మికుల క్షీరాభిషేకం

గజ్వేల్‌ : పింఛన్లతో ఎంతో మంది పేదకుటుంబాల్లో వెలుగులు నిండుతున్నాయని జడ్పీటీసీ మల్లేశం అన్నారు. మండలంలోని పిడిచెడ్‌ గ్రామంలో బీడీ కార్మికులు బుధవారం సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్పీటీసీ మాట్లాడుతూ.. బీడీ కార్మికులకు ప్రభుత్వం ప్రతినెలా రూ.2016  పింఛన్‌ ఇస్తుందన్నారు. ఆర్థిక ఇబ్భందులకు గురవుతున్న క్రమంలో ప్రభుత్వ పింఛన్‌ కుటుంబాలకు ఆసరాగా ఉంటాయన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ శిల్పా అశోక్‌, ఎంపీటీసీ రాజేశ్వరి, వార్డు సభ్యు లు, గ్రామస్తులుపాల్గొన్నారు.logo