బుధవారం 28 అక్టోబర్ 2020
Medak - Sep 23, 2020 , 01:57:21

మత్తడి దుంకుతున్న కొంటూర్‌ చెరువు

మత్తడి దుంకుతున్న కొంటూర్‌ చెరువు

  • n ఆనందం వ్యక్తం చేస్తున్న వెంకటాపూర్‌ గ్రామస్తులు
  • n రైతన్న కండ్లల్లో నిండిన ఆనందం
  • n పూజలు చేసిన ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి 

మెదక్‌ రూరల్‌ : కొద్ది రోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షాలకు కొంటూర్‌ చెరువు జలకళను సంతరించుకున్నది. సోమవారం రాత్రి నుంచి అలుగు పారుతుండడంతో అన్నదాతల కండ్లల్లో  ఆనందం నిండింది. వెంకటాపూర్‌ గ్రామ పరిధిలోని కొంటూర్‌ చెరువు మెదక్‌ మండలంలోనే అతి పెద్ద చెరువు. నాలుగు ఏండ్లుగా చెరువు నిండిన దాఖలాలు లేవు. 2015లో అలుగు పారిన చెరువు మళ్లీ ఈ సారి అలుగు పారుతుండడంతో ఆయకట్టు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 20 రోజులుగా కురుస్తున్న వర్షాలు కురుస్తుండడంతో మండలంలో భూగర్భ జలాలు పెరిగి బోరు మోటర్లు పుష్కలంగా నీరు పోస్తున్నాయి. వానకాలం సీజన్‌లో రైతులు విస్తారంగా పంటలు సాగు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సూచించిన లాభసాటి వ్యవసాయ విధానం ఎక్కువ మంది రైతులు అనుసరించారు. గతంతో పోలిస్తే ఈసారి మండలంలో సాగు విస్తీర్ణం పెరిగింది. మరి కొద్ది రోజులు గడిస్తే వరి పంట చేతికి రానున్నది.   logo