బుధవారం 28 అక్టోబర్ 2020
Medak - Sep 22, 2020 , 02:16:42

బీసీల అభ్యున్నతికి కృషి

బీసీల అభ్యున్నతికి కృషి

మెదక్‌ టౌన్‌ : బీసీల అభ్యున్నతికి కృషి చేస్తానని బీసీ సంక్షేమ సంఘం మెదక్‌ జిల్లా ఉపాధ్యక్షుడు కమ్మరి హరికాంత్‌చారి అన్నారు. సోమవారం మెదక్‌ పట్టణంలోని అతిథి గృహంలో జిల్లా అధ్యక్షుడు మెట్టు గంగరాములు ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో   జిల్లా కమిటీని ఎన్నుకున్నారు. జిల్లా ఉపాధ్యక్షుడిగా కమ్మరి హరికాంత్‌చారి, హవేళి ఘన్‌పూర్‌ అధ్యక్షుడిగా కృష్ణకూమర్‌గౌడ్‌ను ఎన్నుకున్నారు. సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి  మల్లేశం, యువజన జిల్లా ఉపాధ్యక్షుడు వెంకటేశం, దివ్యాంగ విభాగం తూప్రాన్‌ డివిజన్‌ అధ్యక్షుడు కమ్మరి శ్రీనివాస్‌చారి, పట్టణ అధ్యక్షుడు సంతోశ్‌ పాల్గొన్నారు.


logo