శుక్రవారం 30 అక్టోబర్ 2020
Medak - Sep 22, 2020 , 02:16:43

నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ

నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ

మెదక్‌ : గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువకులకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా వారికి 3 నెలల ఉచిత శిక్షణ ఇచ్చి సంబంధిత రంగంలో ఉద్యోగం కల్పిస్తామని డీఆర్‌డీఏ పీడీ శ్రీనివాస్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, సెర్ప్‌ తెలంగాణ ఎంప్లాయీమెంట్‌ జనరేషన్‌ అండ్‌ మార్కెటింగ్‌ మిషన్‌(ఈజీఎంఎం) ద్వారా డీడీయూ-జికేవై (దిన్‌దయాల్‌ ఉపాధ్యాయ గ్రామీణ కోకల్‌ యోజన) కార్యక్రమం కింద జిల్లాలోని నిరుద్యోగ యువకులకు శిక్షణ ఇస్తున్నామన్నారు. కంప్యూటర్‌ నైపుణ్యత, స్పోకెన్‌ ఇంగ్ల్లిష్‌ స్టాఫ్‌ స్కిల్స్‌, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌, టైపింగ్‌, ఆర్థమెటిక్‌, హిందీ గ్రోమింగ్‌, ఇంటర్వ్యూ స్కిల్స్‌, పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌లో శిక్షణ ఉంటుందన్నారు. పదో తరగతి, ఇంటర్‌ పూర్తయిన పురుషులు, 19 నుంచి 26 సంవత్సరాలు ఉండాలన్నారు. ఆసక్తి గల వారు తమ విద్యార్హత సర్టిఫికెట్లు, రేషన్‌కార్డు జిరాక్స్‌, ఆధార్‌కార్డు, జాబ్‌కార్డు, కులం సర్టిఫికెట్‌, నాలుగు పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫొటోలతో మెదక్‌ పట్టణంలోని గాంధీనగర్‌ శ్రీ సరస్వతీ శిశుమందిర్‌లో ఈ నెల 22వ తేదీ నుంచి 30 వరకు ప్రతి రోజు నేరుగా హాజరుకావాలన్నారు. మరిన్ని వివరాలకు 8500057266, 9666286830 నంబర్లలో సంప్రదించాలన్నారు.