ఆదివారం 25 అక్టోబర్ 2020
Medak - Sep 22, 2020 , 02:16:43

నేడు సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞత ర్యాలీ

నేడు సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞత ర్యాలీ

మెదక్‌ : కొత్త రెవెన్యూ చట్టం అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆమోదించినందుకు సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతగా మంగళవారం టీఆర్‌ఎస్‌ పార్టీ ఆధ్వర్యంలో ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించనున్నట్లు జిల్లా పరిషత్‌ వైస్‌ చైర్మన్‌ లావణ్యరెడ్డి, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు తాడెపు సోములు తెలిపారు. వీఆర్వో వ్యవస్థ రద్దు చేస్తూ కొత్త రెవెన్యూ చట్టం తీసుకువచ్చినందుకు సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. మంగళవారం జిల్లా కేంద్రమైన మెదక్‌లోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల నుంచి కలెక్టరేట్‌ వరకు ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమానికి టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. 

హాజరుకానున్న ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు...

మంగళవారం నిర్వహించే ట్రాక్టర్‌ ర్యాలీలో మెదక్‌ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, సీఎం కేసీఆర్‌ రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి హాజరుకానున్నారు.  logo