సోమవారం 26 అక్టోబర్ 2020
Medak - Sep 21, 2020 , 00:05:06

స్వచ్ఛ రామాయంపేటే లక్ష్యం

స్వచ్ఛ రామాయంపేటే లక్ష్యం

రామాయంపేట: స్వచ్ఛ రామాయంపేటగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని మున్సిపల్‌ చైర్మన్‌ పల్లె జితేందర్‌గౌడ్‌ అన్నారు. ఆదివారం పట్టణంలోని పట్టణ ప్రగతిలో భాగంగా పారిశుధ్య పనులు జరుగుతున్న 12, 6, 8, 2, 11వ వార్డులో చైర్మన్‌ పల్లె జితేందర్‌గౌడ్‌, కౌన్సిలర్లు దేమె యాద గిరి, గంగాధర్‌, చింతల భవాని, సరాఫ్‌ సౌభాగ్య పరిశీలించారు. సీఎం కేసీఆర్‌ పట్టణాల అభివృద్ధికి పట్టణ ప్రగతిని ప్రవేశపెట్టారని అన్నారు. పట్టణ ప్రగతిలో స్వచ్ఛ రామాయంపేటగా తీర్చిదిద్దుతానని చెప్పారు. కార్యక్రమంలో బిల్‌ కలెక్టర్‌ కాలేరు ప్రసాద్‌, నవాత్‌ ప్రసాద్‌, బల్ల శ్రీనివాస్‌, పోచమ్మల శంకర్‌, నరేశ్‌, మెట్టు యాదగిరి, బాలుగౌడ్‌, బాసం శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

గ్రామాల్లో స్వచ్ఛభారత్‌

తూప్రాన్‌ రూరల్‌ : తూప్రాన్‌ మండలం మల్కాపూర్‌, ఇస్లాంపూర్‌ గ్రామాల్లో పరిసరాల శుభ్రత, స్వచ్ఛభారత్‌ కార్యక్రమాలను నిర్వహించారు. ఆదర్శ గ్రామమైన మల్కాపూర్‌లోని రాక్‌గార్డెన్‌లో పేరుకుపోయిన కలుపు మొక్కలు, గడ్డి, చెత్తాచెదారాన్ని తొలిగించి శుభ్రం చేశారు. ఇస్లాంపూర్‌లోని పలు వీధులు, పరిసరాల్లో కలుపుమొక్కలు తొలిగించారు. ఇండ్ల పరిసరాలు, వీధులు, రోడ్లను  మహిళలు చీపుర్లతో ఊడ్చి శుభ్రం చేశారు. కార్యక్రమాల్లో మేక్‌ఇన్‌ మల్కాపూర్‌ యూత్‌ సభ్యులు, స్వచ్ఛభారత్‌ యువకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.


logo