గురువారం 22 అక్టోబర్ 2020
Medak - Sep 20, 2020 , 03:03:30

మొదటి విడుత గృహాలను సిద్ధం చేయండి

మొదటి విడుత గృహాలను సిద్ధం చేయండి

  • ముట్రాజ్‌పల్లి ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీలో  అధికారులతో సమీక్షించిన కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి

గజ్వేల్‌ అర్బన్‌: మల్లన్నసాగర్‌ ముంపు గ్రామాల ప్రజల కోసం నిర్మిస్తున్న ముట్రాజ్‌పల్లి ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీలో మొదటి విడుతగా అప్పగించడానికి గృహాలను పూర్తిస్థాయిలో సిద్ధం చేయాలని కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం ముట్రాజ్‌పల్లి ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీలో రెవె న్యూ ఇరిగేషన్‌ తదితర శాఖల అధికారులతో కలెక్టర్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి త్వరగా పూర్తిచేయాలన్నారు. నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీ గృహ నిర్మాణాలు చేపట్టాలని ఏజెన్సీ ప్రతినిధులను కలెక్టర్‌ ఆదేశించారు.  కాలనీ నిర్మాణ పనులను జోన్‌ 1, 2, 3లను మొదటి ప్రాధాన్యత కింద తీసుకోవాలన్నారు. వారం రోజుల తర్వాత పనుల పురోగతిపై సమీక్షిస్తానని, అప్పటిలోగా లక్ష్యానికి తగ్గట్టుగా పనులు పూర్తి చేయాలన్నారు. సమావేశంలో అసిస్టెంట్‌ ట్రైనీ కలెక్టర్‌ దీపక్‌ తివారీ, ఆర్డీవో విజయేందర్‌రెడ్డి, పంచాయతీరాజ్‌ ఎస్‌ఈ కనకరత్నం, పీఆర్‌డీఈలు రామచంద్రం, ప్రభాకర్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఈఈ రాజయ్య, తహసీల్దార్లు అన్వర్‌, అరుణ, ఏజెన్సీ ప్రతినిధులు పాల్గొన్నారు.logo