మంగళవారం 20 అక్టోబర్ 2020
Medak - Sep 19, 2020 , 02:21:18

డిగ్రీ కాంట్రాక్ట్‌ లెక్చరర్స్‌ను రెన్యువల్‌ చేయాలి

డిగ్రీ కాంట్రాక్ట్‌ లెక్చరర్స్‌ను  రెన్యువల్‌ చేయాలి

  • విద్యాశాఖ మంత్రి సబితారెడ్డికి వినతిపత్రం

మెదక్‌ : తెలంగాణలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ లెక్చరర్స్‌ను రెన్యువల్‌ చేయాలని శుక్రవారం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కలిసి తెలంగాణ డిగ్రీ కాంట్రాక్ట్‌ లెక్చరర్స్‌ ప్రతినిధులు వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు వినోద్‌కుమార్‌, అసోసియేట్‌ అధ్యక్షురాలు అరుణకుమారి మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో కాంట్రాక్ట్‌ లెక్చరర్స్‌ తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాపోయారు. కాంట్రాక్ట్‌ లెక్చరర్లకు ప్రతి నెలా వేతనాలు అం దేలా చూడాలన్నారు. తమ సమస్యలు తెలుసుకున్న మం త్రి సబితారెడ్డి సానుకూలంగా స్పందించినట్టు తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణ డిగ్రీ కాంట్రాక్ట్‌ లెక్చరర్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు వినయ్‌కుమార్‌ పాల్గొన్నారు.


logo