శుక్రవారం 30 అక్టోబర్ 2020
Medak - Sep 17, 2020 , 02:53:18

ఖాళీ పోస్టులను భర్తీ చేయాలి

ఖాళీ పోస్టులను భర్తీ చేయాలి

  • శాసన మండలి స్పెషల్‌ మెన్షన్‌లో ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి

మెదక్‌ : మెదక్‌ జిల్లా ఆర్టీఏ కార్యాలయంలో ఖాళీగా ఉన్న పోస్టులను నియామకం చేయాలని సీఎం కేసీఆర్‌ రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర శాసన మండలి వానకాల సమావేశాల్లో భాగంగా బుధవారం స్పెషల్‌ మెన్షన్‌లో మెదక్‌ రవాణా శాఖ కార్యాలయంలో డ్రైవింగ్‌ లైసెన్స్‌లు, వాహనాల రిజిస్ట్రేషన్ల జారీలో ఉన్న ఇబ్బందులను తొలిగించాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ దృష్టికి తీసుకెళ్లారు. ప్రస్తుతం మెదక్‌ రవాణా శాఖలో పనిచేస్తున్న అధికారులు సైతం ఇన్‌చార్జిలేనని మంత్రి అజయ్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి లేవనెత్తిన అంశంపై స్పందించిన రవాణా శాఖ మంత్రి అజయ్‌ ఈ అంశం పరిశీలనలో ఉందని, తొందరలోనే ప్రమోషన్లు ఇచ్చి ఖాళీలను భర్తీ చేస్తామని సమాధానమిచ్చారు.