ఆదివారం 25 అక్టోబర్ 2020
Medak - Sep 14, 2020 , 00:11:07

పెండింగ్‌ పనులను పూర్తి చేయాలి

పెండింగ్‌ పనులను పూర్తి చేయాలి

చేగుంట: నార్సింగి మండల ఏర్పాటుకు దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి కృషి మరువలేనిదని ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌రెడ్డి అన్నారు. ఆదివారం నార్సింగి ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ సబిత అధ్యక్షతన మధ్యాహ్నం నిర్వహించిన సర్వసభ్య సమావేశానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. సభ్యులు గ్రామాల్లోని సమస్యలను సభ దృష్టికి తీసుకువచ్చారు. గ్రామాల్లో నెలకొన్న అత్యవసర సమస్యలతో పాటు పెండింగ్‌ పనులను వెంటనే పూర్తి చేయాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. సమావేశంలో ఎంపీపీ చిందం సబిత, జడ్పీటీసీ బాణపురం కృష్ణారెడ్డి, వైస్‌ ఎంపీపీ సుజాత,ఎంపీటీసీలు సత్యనారాయణ, సుజాత, సంతోష, సర్పంచులు , ఎంపీడీవో, తహసీల్దార్‌ పాల్గొన్నారు. అనంతరం చేగుంట మండలం వల్లభాపూర్‌, చిన్నశంకరంపేట మండలంలోని కాస్లాపూర్‌ గ్రామాన్ని నార్సింగి మండలంలో కలుపాలని ఎమ్మెల్యేకు సభ్యులు వినతిపత్రం అందజేశారు.


logo