ఆదివారం 25 అక్టోబర్ 2020
Medak - Sep 11, 2020 , 03:05:17

గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తా

గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తా

  • జడ్పీ చైర్‌పర్సన్‌ హేమలతాశేఖర్‌గౌడ్‌

మనోహరాబాద్‌ : జిల్లా అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తానని జడ్పీ చైర్‌పర్సన్‌ ర్యాకల హేమలతాశేఖర్‌గౌడ్‌ అన్నారు. మనోహరాబాద్‌ మండలం పోతారం నుంచి శివ్వంపేట మండలం గంగాయిపల్లి వరకు మట్టి రోడ్డును పరిశీలించారు. బీటీ రోడ్డు మంజూరు అయ్యేందుకు సహకరిస్తానన్నారు. పోతారంలో నిర్మాణంలో ఉన్న మరుగుదొడ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం పాలాటలో సబ్సిడీపై నిర్మించే కల్లాలకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ప్రతి గ్రామాన్ని వందశాతం ఓడీఎఫ్‌ గ్రామాలుగా మార్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. జిల్లాలోని అన్ని మండలాల్లో వైకుంఠధామాలు, చెత్త నిర్వాహణ కేంద్రాలు పూర్తి దశకు చేరుకున్నాయన్నారు. రైతులు పండించిన పంటను ఆరబెట్టుకునేందుకు తమ పొలాల్లోనే కల్లాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. వీటి నిర్మాణానికి ప్రభుత్వం సబ్సిడీ అందిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో రైతుబంధు మండల కో ఆర్డినేటర్‌ సుధాకర్‌రెడ్డి, ఎంపీడీవో జైపాల్‌రెడ్డి, వైస్‌ ఎంపీపీ విఠల్‌రెడ్డి, సర్పంచ్‌లు మాధవరెడ్డి, వెంకటేశ్వర్లు, ఉపసర్పంచ్‌లు వీరేశ్‌, రేణుకుమార్‌, టీఆర్‌ఎస్‌ గ్రామ కమిటీ అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి, నాయకులు రమేశ్‌, మహేందర్‌ పాల్గొన్నారు. 


logo