గురువారం 29 అక్టోబర్ 2020
Medak - Sep 10, 2020 , 03:40:47

పంటల వివరాలను నమోదు చేసుకోవాలి

పంటల వివరాలను నమోదు చేసుకోవాలి

  • జిల్లా వ్యవసాయ శాఖ అధికారి  పరశురాంనాయక్‌

చేగుంట: ప్రతి రైతు పంటల వివరాలను నమోదు చేసుకోవాలని  జిల్లా వ్యవసాయశాఖ అధికారి పరశురాంనాయక్‌ పేర్కొన్నారు.నార్సింగి మండల పరిధిలోని పలు గ్రామాల్లో బుధవారం పర్యటించి  రైతుల పంటల వివరాల నమోదును పరిశీలించారు. రామాయంపేట వ్యవసాయ డివిజన్‌ అధికారి వసంత సుగుణ శేరిపల్లి గ్రామంలో నిర్మిస్తున్న రైతు వేదిక  పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా పరుశురాంనాయక్‌  మాట్లాడుతూ ప్రతి  రైతుకు సంబంధించిన పంటల వివరాలను నమోదు చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఏవో యాదగిరి,మండల రైతు సంఘం అధ్యక్షుడు ఎన్నం లింగారెడ్డి, ఎంపీటీసీ సత్యనారాయణ, ఏఈవో దివ్య, శ్రీనివాస్‌తో పాటు పలువురు రైతులు ఉన్నారు.

హవేళిఘనపూర్‌లో..

హవేళిఘనపూర్‌: మండల పరిధిలోని ఆయా గ్రామాల్లో రైతులు సాగు చేసిన పంటలను జిల్లా వ్యవసాయ అధికారి పరశురాంనాయక్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు సాగు చేసిన పంటలకు తెగుళ్లు తదితర  వాటిని గురించి అడిగి తెలుసుకొని వారికి సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జి మండల వ్యవసాయ అధికారి విజృంభన, వ్యవసాయ విస్తరణ అధికారులు ప్రశాంత్‌, రాకేశ్‌, స్వాతి ఉన్నారు. 

వెల్దుర్తిలో.. 

వెల్దుర్తి: వానకాలం సాగులో భాగంగా రైతులు సాగు చేస్తున్న పంటలను పరిశీలిస్తున్నట్లు కౌడిపల్లి డివిజన్‌ ఏడీఏ బాబునాయక్‌ తెలిపారు. మండలంలోని మంగళపర్తి, మన్నెవారి జలాల్‌పూర్‌, మానేపల్లి గ్రామాల్లో  పంటలను, మంగళపర్తిలో రైతువేదిక నిర్మాణ పనులను ఏవో మాలతితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఏడీఏ బాబునాయక్‌ మాట్లాడుతూ గ్రామీణ విత్తనోత్పత్తిలో భాగంగా పంటలను పరిశీలించి రైతులకు సస్యరక్షణ చర్యలను సూచిస్తున్నట్లు తెలిపారు. పలు గ్రామాల్లో వరిపంటకు అగ్గితెగులు గుర్తించామని, అగ్గితెగులు సోకితే ట్రైసైక్లోజోల్‌ మందును పిచికారీ చేయాలన్నారు. రైతువేదికల నిర్మాణాలతో రైతుల ఏకీకరణ జరుగుతుందన్నారు. త్వరితగతిన రైతువేదికల నిర్మాణాలను పూర్తి చేయాలని సూచించారు. వీరివెంట ఏఈవో గౌతమి, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, రైతుబంధు కోఆర్డినేటర్లు  రైతులు ఉన్నారు. 


logo