గురువారం 22 అక్టోబర్ 2020
Medak - Sep 09, 2020 , 00:59:26

సన్నాయిలను బీసీల్లో చేర్చడంపై హర్షం

సన్నాయిలను బీసీల్లో చేర్చడంపై హర్షం

  • సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం

సంగారెడ్డి : సీఎం కేసీఆర్‌ సన్నాయిలను బీసీ జాబితాలో చేర్చడంపై దశాబ్దాల కల నెరవేరిందని ఆ సంఘం నాయకులు హర్షం వ్యక్తం చేశారు. మంగళవారం శాసనసభా సమావేశాల్లో సన్నాయిల కులాన్ని బీసీ జాబితాలో చేర్చడంతో ఆ సంఘం నాయకులు సంగారెడ్డి కలెక్టరేట్‌ ముందున్న తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా సన్నాయిల సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు శేఖర్‌, రాములు మాట్లాడుతూ వెనుకబడిన తరగతుల్లో మరో 17 కులాలను చేర్చి సీఎం కేసీఆర్‌ సామాజిక న్యాయం చేశారన్నారు. తమ దశాబ్దాల కళ నెరవేరిందని, ఇప్పటివరకు గత ప్రభుత్వాలు పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. ఇక నుంచి తమ జీవితాల్లో కొత్త శకం మొదలైందని ఆనందం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సంఘం ఉపాధ్యక్షులు కాసాల కృష్ణ, ముత్యాలు, నాయకులు భిక్షపతి, అంబయ్య, సిద్ది రాములు, జగన్‌, మల్లయ్య, సాయికృష్ణ తదితరులు పాల్గొన్నారు.


logo