గురువారం 29 అక్టోబర్ 2020
Medak - Sep 09, 2020 , 00:59:42

అనధికారిక లేఅవుట్లలో మీ ప్లాట్‌ ఉందా...?

అనధికారిక లేఅవుట్లలో మీ ప్లాట్‌ ఉందా...?

  • వచ్చే నెల 15 వరకు క్రమబద్ధీకరణకు చాన్స్‌

సంగారెడ్డి మున్సిపాలిటీ : మున్సిపల్‌ పరిధి, గ్రామీణ ప్రాంతాల్లో అనధికారిక లేఅవుట్లలో మీ ప్లాట్‌ ఉందా...? ఉంటే క్రమబద్ధీకరణకు వచ్చే నెల అక్టోబర్‌ 15వ తేదీ వరకు చివరి అవకాశం ఉందని మున్సిపల్‌ ఇన్‌చార్జి కమిషనర్‌, అదనపు కలెక్టర్‌ రాజర్షి షా మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని అనధికారిక ప్లాట్లు, లేఅవుట్లను లేఅవుట్‌ రెగ్యులరైజేషన్‌ స్కీమ్‌ (ఎల్‌ఆర్‌ఎస్‌) ద్వారా క్రమబద్ధీకరించుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించిందన్నారు. ఒకవేళ తమ ప్లాట్లను క్రమబద్ధీకరించుకోనట్లయితే రిజిస్ట్రేషన్‌, భవన నిర్మాణ అనుమతులు, తాగునీటి కనెక్షన్‌, విద్యుత్‌ కనె క్షన్లకు అనుమతులు ఉండవని తెలిపారు. 

దరఖాస్తుదారులు ఆన్‌లైన్‌లో సులువుగా దాఖలు చేసుకోవచ్చు..

n కామన్‌ వెబ్‌ పోర్టల్‌

n మీ సేవ కేంద్రం

n ప్రత్యేకించి ఇందుకు ఉద్దేశించిన స్మార్ట్‌ఫోన్‌ యాప్‌ 

ద్వారా దాఖలు చేసుకోవచ్చు

చెల్లించాల్సిన దరఖాస్తు రుసుము..

n వ్యక్తిగత ప్లాట్ల కోసం రూ.1,000 (దరఖాస్తుతో పాటుగా)

n లేఅవుట్‌ డెవలపర్స్‌ కోసం రూ.10,000 (మొత్తం లేఅవుట్‌ కోసం దరఖాస్తు చేస్తునట్లయితే)

n దరఖాస్తు చేసుకున్న తర్వాత క్రమబద్ధీకరణ రుసుమును 31-01-2021లోగా పూర్తిగా చెల్లించాలి.

n స్కీమ్‌, క్రమబద్ధీకరణ రుసుము వివరాలకు http://lrs.telangana.gov.in/వివరాల కోసం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల్లోపు ఈ నెంబర్లను సంప్రదించండి..

n హెచ్‌ఎండీఏ పరిధిలోని ప్లాట్ల కోసం : 

1800-4258838

n జీహెచ్‌ఎంసీ పరిధిలోని ప్లాట్ల కోసం : 

040-2111 1111


logo