శుక్రవారం 30 అక్టోబర్ 2020
Medak - Sep 07, 2020 , 23:42:07

ఎనిమిది వందల ఏండ్ల వినాయక విగ్రహాల పరిశీలన

ఎనిమిది వందల ఏండ్ల వినాయక విగ్రహాల పరిశీలన

కొండపాక : మండలంలోని మంగోల్‌ అటవీ ప్రాంతంలో ఆదరణకు నోచుకోకుండా ఉన్న అతిపెద్ద స్వయంభు వినాయక విగ్రహాలను విద్యాగణేశ సంస్థాన పీఠాధిపతులు గణేశానందభారతి స్వామి సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా స్వామి మహావిగ్రహం ఏనాటిదో పరిశీలించి ఎనిమిది వందల సంవత్సరాల కిందిదని చెప్పారు. ఇటువంటి విగ్రహాలు అరుదుగా ఉంటాయన్నారు. అంతకుముందు స్వామి విగ్రహానికి ప్రత్యేక పూజలు చేశారు.  ఆయన వెంట సర్పంచ్‌ కిరణ్‌కుమార్‌, కుకునూర్‌పల్లె మాజీ సర్పంచ్‌ నవీన్‌కుమార్‌, ఉప్పల పాండు రంగం, ఉప్పల రాజు, పురోహితుడు పవన్‌ స్వామి వారిని దర్శించుకున్నారు.