బుధవారం 21 అక్టోబర్ 2020
Medak - Sep 07, 2020 , 01:44:02

ఆలయాల్లో పూజలు

ఆలయాల్లో పూజలు

చేర్యాల : కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారి దర్శనానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. పుణ్యక్షేత్రానికి సుమారు 15 వేల మంది పైగా భక్తులు తరలివచ్చినట్లు ఆలయవర్గాలు తెలిపారు. స్వామి వారి దర్శనానికి తరలివచ్చిన భక్తులతో రాజగోపురంతో పాటు ఆలయ ప్రధాన వీధులు నిండిపోయాయి. ఆలయవర్గాలు శానిటైజర్లు, ధర్మల్‌ స్క్రీనింగ్‌తో పరీక్షలు చేసి భక్తులను ఆలయప్రవేశానికి అనుమతినిచ్చారు. ఈవో టంకశాల వెంకటేశ్‌, ఏఈవో గంగా శ్రీనివాస్‌, ఆలయ ప్రధానార్చకుడు మహాదేవుని మల్లికార్జున్‌, సూపరింటెండెంట్‌ నీల శేఖర్‌, భక్తులకు ఇబ్బంది కలిగించకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. 

మెదక్‌ చర్చిలో ప్రార్థనలు 

మెదక్‌ టౌన్‌: ప్రభువు చూపిన మార్గాన్ని అనుసరించి శాంతి, ప్రేమతత్వాన్ని అలవర్చుకోవాలని మెదక్‌ బిషప్‌ రెవరెండ్‌ ఏసీ సాలోమాన్‌రాజ్‌ అన్నారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మెదక్‌ సీఎస్‌ఐ చర్చిలో ఆదివారం భక్తులు ఏసయ్య మందిరాన్ని దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో చర్చి ప్రెసిబెటరీ ఇన్‌చార్జి రెవరెండ్‌ అండ్రూస్‌ ప్రేమ్‌సుకుమార్‌, మత గురువులు విజయ్‌కుమార్‌, దయానంద్‌, రాజశేఖర్‌, ఐవన్‌ అనుగ్రహం పాల్గొని భక్తులకు ఆశీర్వాదాలు ఇచ్చారు. 

ఏడుపాయల్లో భక్తుల సందడి

పాపన్నపేట: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గభవానీమాత సన్నిధి ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. పలు ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు భౌతికదూరం పాటిస్తూ శానిటైజర్‌ వాడుతూ దర్శనం చేసుకునేలా ఏడుపాయల ఈవో సార శ్రీనివాస్‌, సిబ్బంది తగిన ఏర్పాట్లు చేశారు. వేద బ్రాహ్మణులు శంకరశర్మ, నరసింహాచారి, పార్థివశర్మ, రాముశర్మ, రాజశేఖర్‌శర్మ, నాగరాజుశర్మ అమ్మవారి సేవల్లో నిమగ్నమయ్యారు. ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా పాపన్నపేట ఎస్సై ఆంజనేయులు తమ సిబ్బందితో బందోబస్తు చర్యలు చేపట్టారు.


logo