ఆదివారం 25 అక్టోబర్ 2020
Medak - Sep 06, 2020 , 02:35:54

త్వరగా పంట వివరాల సేకరణ పూర్తి చేయాలి

త్వరగా పంట వివరాల సేకరణ పూర్తి చేయాలి

  •  వీడియో కాన్ఫరెన్స్‌లో వ్యవసాయ శాఖ
  •  ప్రిన్సిపల్‌ సెక్రటరీ జనార్దన్‌రెడ్డి

మెదక్‌ : పంట వివరాలు సేకరణను వచ్చే వారం రోజుల వ్యవధిలో పూర్తి చేయాలని వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ జనార్దన్‌రెడ్డి వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. శనివారం వ్యవసాయ శాఖ అధికారులు, సహాయ సంచాలకులు, మండల వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వానకాలంలో పంట వివరాల సేకరణ, ఎరువుల సరఫరా, వివిధ పంటల్లో వచ్చే చీడ పీడలు, తెగుళ్లు, ఎరువుల యాజమాన్యం గురించి ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తల ద్వారా అవగాహన కల్పించామన్నారు. పురుగుల మందులు, ఎరువులు కొనుగోలు సమయంలో డబ్బు రూపేనా కాకుండా డిజిటల్‌ పద్ధతిలో ఆన్‌లైన్‌ ద్వారా డబ్బులు చెల్లించే విధంగా రైతులకు అవగాహన కల్పించాలన్నారు. మోతాదు మేరకు ఎరువులు, పురుగుల మందుల వాడకం గురించి రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. వచ్చే యాసంగి కాలానికి సంబంధించి ఎంత పంట సాగు అవుతుందో వాటికి కావాల్సిన ఎరువులు, విత్తనాల ప్రణాళిక ముందస్తుగానే తయారు చేసుకోవాలని తెలిపారు.logo