శనివారం 31 అక్టోబర్ 2020
Medak - Sep 05, 2020 , 01:54:42

దసరా నాటికి రైతు వేదికలు

దసరా నాటికి రైతు వేదికలు

  • జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షుడు సోములు

మెదక్‌ రూరల్‌: దసరా నాటికి జిల్లాలోని రైతు వేదిక భవనాల నిర్మాణాలు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షుడు సోములు అన్నారు. శుక్రవారం మెదక్‌ మండల పరిధిలోని రాజ్‌పల్లిలో నిర్మిస్తున్న రైతు వేదిక భవనాన్ని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి పరశురాంనాయక్‌తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా సోములు మాట్లాడుతూ రైతులు పండించే పంటలకు స్వయంగా ధర నిర్ణయించే విధంగా సీఎం కేసీఆర్‌ రైతు వేదిక నిర్మాణాలకు శ్రీకారం చుట్టారన్నారు. రైతులను సంఘటిత పరిచి వారి సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నారు. ప్రభుత్వం అనుసరిస్తున్న సమగ్ర పంటల విధానంపై అన్నదాతలకు మరింత అవగాహన కల్పించడం రైతు వేదికల ప్రధాన ఉద్దేశమన్నారు. అధునాతన సౌకర్యాలతో పాటు రైతులకు అవసరమైన సూచనలు, సలహాలు ఇచ్చేందుకు, అధికారులతో చర్చించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను కల్పిస్తుందన్నారు.  జిల్లా వ్యాప్తంగా దసరా నాటికి నిర్మాణాలను పూర్తి చేసి ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ సందర్భంగా కాంట్రాక్టర్‌కు పనులు త్వరితగతిన చేయాలని ఆదేశించారు. ఆయన వెంట మండల వ్యవసాయ శాఖ అధికారి లక్ష్మీప్రవీణ్‌ ఉన్నారు.