ఆదివారం 25 అక్టోబర్ 2020
Medak - Sep 05, 2020 , 01:54:44

రాజకీయాలకతీతంగా సంక్షేమ పథకాలు

రాజకీయాలకతీతంగా సంక్షేమ పథకాలు

  • అదనపు కలెక్టర్‌ ముజామ్మిల్‌ ఖాన్‌

దుబ్బాక: రాజకీయాలకతీతంగా పేదలకు సంక్షేమ ఫలాలు అందించాలని సిద్దిపేట అదనపు కలెక్టర్‌ ముజామ్మిల్‌ఖాన్‌ అన్నారు. శుక్రవారం సాయంత్రం దుబ్బాకలో అదనపు కలెక్టర్‌ పర్యటించి  ఎంపీడీవో కార్యాలయంలో నియోజకవర్గ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం ఐకేపీ కార్యలయంలో ఐకేపీ సిబ్బంది, గ్రామఖ్య సంఘాలతో సమావేశమయాయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అభివృద్ధి కార్యక్రమాల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవన్నారు. గ్రామాల్లో మహిళా సంఘాలకు  రుణాలు అం దించాలన్నారు. మహిళల ఆర్థిక స్వావలంబనకు ఐకేపీ అధికారులు దృష్టి సారించాలని సూచించారు. 

 వీధి వ్యాపారుల స్థితిగతులపై ఆరా..

పట్టణంలో వీధి వ్యాపారుల స్థితిగతులను అదనపు కలెక్టర్‌ మజామ్మిల్‌ఖాన్‌ స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఆత్మ నిర్భర్‌ పథకం ద్వారా వ్యక్తిగత(స్వ నిధి) రుణాలు ప్రభుత్వం అందిస్తున్నందున, వాటిని ఎంతమేరకు సద్వినియోగ పర్చుకుంటున్నారని పలువురు వీధి వ్యారులను అడిగి తెలుసుకున్నారు.  మున్సిపాలలిటీ పరిధిలో ఇప్పటివరకు 150 మందికి ఒక్కొక్కరికి రూ.10 వేలు రుణాలు అందించామని కమిషనర్‌ అదనపు కలెక్టర్‌కు వివరించారు. మరో 200 మందికి త్వరలోనే అందిస్తామన్నారు. అనంతరం దుబ్బాకలో రూ.10 లక్షలతో నిర్మిస్తున్న పార్కు పనులను అదనపు కలెక్టర్‌ పరిశీలించారు. నాన్‌వెజ్‌ మార్కెట్‌ను, చౌరస్తాలో నిర్మాణ పనులు, రామసముద్రం చెరువుకట్టపై, దుబ్బాక పెద్ద చెరువు కట్ట సమీపంలో నిర్మిస్తున్న వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. ఆయన వెంట డీపీవో  సురేశ్‌బాబు, డీఆర్‌డీవో గోపాల్‌రావు, మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ వనిత, కమిషనర్‌ నర్సయ్య, ఎంపీడీవో భాస్కరశర్మ, ఐకేపీ ఏపీఎం బాపురావు తదితరులున్నారు.  


logo