శనివారం 31 అక్టోబర్ 2020
Medak - Sep 03, 2020 , 00:13:16

10 చెక్‌డ్యామ్‌ల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం

10 చెక్‌డ్యామ్‌ల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం

  • జహీరాబాద్‌ ఎమ్మెల్యే కొనింటి మాణిక్‌రావు

జహీరాబాద్‌: రైతులకు లక్ష ఎకరాలకు సాగు నీరు అందించేందుకు వరదనీటి నిల్వ చేసేందుకు చెక్‌డ్యామ్‌లు నిర్మాణానికి ప్రతిపాదనాలు సిద్ధం చేయాలని ఎమ్మెల్యే కొనింటి మాణిక్‌రావు అన్నారు. బుధవారం జహీరాబాద్‌లోని క్యాంపు కార్యాలయంలో నీటివనరుల శాఖ అధికారులతో చెక్‌డ్యాంల నిర్మాణంపై ఆయన సమీక్ష చేశారు. నియోజకవర్గంలో 10 భారీ చెక్‌డ్యాంలు నిర్మా ణం చేసేందుకు  రూ. 10.90 కోట్లుతో ప్రతిపాదనాలు సిద్ధం చేసి ప్రభుత్వనికి పంపిస్తామన్నారు. నారింజ ప్రాజెక్టు నీరు నిరుపయోగంగా కర్ణాటక వైపు పోకుండా ఉండేందుకు బుర్థిపాడు, బుచినెల్లి, సత్వార్‌, చెరాగ్‌పల్లిలో నాలుగు చెక్‌డ్యాంలు నిర్మాణం చేపట్టాలని సూచించారు. గోటిగార్‌పల్లి పెద్దవాగు పై కర్ణాటకలోని చందపూర్‌ ప్రాజెక్టుకు  నిరుపయోగంగా నీరు పోకుండా  ఉండేందుకు జాడిమాల్కాపూర్‌, మల్‌చల్మా గ్రామాల్లో రెండు చెక్‌డ్యాంలు, ఝరాసంగం మండలంలోని కుడిసంగం వాగు పై చెక్‌డ్యాం,  న్యాల్‌కల్‌ మం డలంలోని చినిగేపల్లి, హుమ్నాపూర్‌, చీకుర్తి గ్రామాల్లో చెక్‌డ్యాంలు నిర్మాణం చేయాలని కోరారు. నిధులు మంజూరు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, వెంటనే సర్వే చేసి ప్రతిపాదనలు రూపొందించాలన్నారు. కార్యక్రమంలో డీఈఈ రమాణారెడ్డి, ఏఈ జానకిరాంతోపాటు పలువురు అధికారులు ఉన్నారు.