గురువారం 29 అక్టోబర్ 2020
Medak - Sep 01, 2020 , 02:26:03

తడి, పొడి చెత్తను వేరు చేయాలి

తడి, పొడి చెత్తను వేరు చేయాలి

  • మున్సిపల్‌ చైర్మన్‌ బొంది రాఘవేందర్‌గౌడ్‌

తూప్రాన్‌ రూరల్‌ : తడి, పొడి చెత్తను పరిసరాలు, వీధుల్లో పారబోయకుండా మున్సిపాలిటీ ఆటో ట్రాలీ రిక్షాల్లోనే వేయాలని తూప్రాన్‌ మున్సిపల్‌ చైర్మన్‌ బొంది రాఘవేందర్‌గౌడ్‌ అన్నారు. తూప్రాన్‌ పట్టణ శివారులోని రామాలయం సమీపంలో సోమవారం వైస్‌ చైర్మన్‌ నందాల శ్రీనివాస్‌, కమిషనర్‌ ఖాజామోజియొద్దీన్‌, పట్టణ కౌన్సిలర్లతో కలిసి ఆయన డంపింగ్‌యార్డు నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తడి, పొడి చెత్తను, ప్లాస్టిక్‌ వ్యర్థాలను ఇండ్లలోనే వేరుచేయాలన్నారు. సేకరించిన తడిచెత్తతో తయారు చేసిన సేంద్రియ ఎరువులతో రైతులకు ప్రయోజం కలుగుతుందని, ప్లాస్టిక్‌ వ్యర్థాలను రీసైక్లిన్‌కు తరలించడం ద్వారా మున్సిపాలిటీకి ఆదాయం సమకూరుతుందన్నారు. మున్సిపాలిటీ పట్టణంలో పరిశుభ్రత కన్పించాలన్నదే సీఎం కేసీఆర్‌, మంత్రి హరీశ్‌రావు, ఎఫ్‌డీసీ చైర్మన్‌ వంటేరు ప్రతాప్‌రెడ్డి ధ్యేయమన్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు సతీశ్‌చారి, పట్టణ కౌన్సిలర్లు మామిండ్ల జ్యోతికృష్ణ, కుమ్మరి రఘుపతి, మామిడి వెంకటేశ్‌, భగవాన్‌రెడ్డి, శ్రీశైలంగౌడ్‌, రవీందర్‌గుప్తా, ఉమాసత్యలింగం, తలారిమల్లేశ్‌, పీఆర్‌ ఏఈ విజయ్‌ప్రకాశ్‌, సిబ్బంది పాల్గొన్నారు.

అసత్య ప్రచారాలు నమ్మవొద్దు... - మున్సిపల్‌ చైర్మన్‌ రాఘవేందర్‌గౌడ్‌ 

డంపింగ్‌ యార్డు నిర్మాణాలతో ప్రజలకు ఇబ్బందులు కలుగుతాయన్న ప్రచారంలో ఏ మాత్రం వాస్తవం లేదని మున్సిపల్‌ చైర్మన్‌ బొంది రాఘవేందర్‌గౌడ్‌ అన్నారు. డంపింగ్‌ యార్డులో వివిధ రకాల మొక్కలు నాటి ఆహ్లాదకరమైన వాతావరణం కల్పిస్తామన్నారు. ప్రజలు, పరిసర ప్రాంతాల వారికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. పట్టణాభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాల్సిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు.

కరోనా కట్టడికి సమన్వయంతో పని చేయాలి

తూప్రాన్‌ రూరల్‌ : తూప్రాన్‌ పట్టణంలో కరోనాను కట్టడి చేసేందుకు మున్సిపల్‌, పోలీసు, స్థానిక వైద్యసిబ్బంది సమన్వయంతో పని చేయాలని మున్సిపల్‌ చైర్మన్‌ బొంది రాఘవేందర్‌గౌడ్‌ అన్నారు. వైస్‌ చైర్మన్‌ నందాల శ్రీనివాస్‌, కమిషనర్‌ ఖాజామోజియొద్దీన్‌, పట్టణ కౌన్సిలర్లతో కలిసి స్థానిక మున్సిపల్‌ కార్యాలయంలో సోమవారం వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కరోనా వైరస్‌పై పట్టణంలోని 16 వార్డుల్లో ఎప్పటికప్పుడూ పర్యటిస్తూ వైరస్‌ నియంత్రణకు ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. మాస్క్‌లు ధరించడం, భౌతికదూరం పాటించకుండా తిరిగితే వారిని గుర్తించి జరిమానాలు వేయాలని పోలీసు అధికారులకు సూచించారు. కార్యక్రమంలో వివిధశాఖల అధికారులు, పట్టణ కౌన్సిలర్లు మామిండ్ల జ్యోతికృష్ణ, కుమ్మరి రఘుపతి, మామిడి వెంకటేశ్‌, భగవాన్‌రెడ్డి, శ్రీశైలంగౌడ్‌,రవీందర్‌గుప్తా, ఉమాసత్యలింగం, తలారిమల్లేశ్‌, పీఆర్‌ ఏఈ విజయ్‌ప్రకాశ్‌ తదితరులు పాల్గొన్నారు.


logo