మంగళవారం 20 అక్టోబర్ 2020
Medak - Aug 29, 2020 , 00:58:49

సీఎం మాట నిలబెట్టాలి

సీఎం మాట నిలబెట్టాలి

  •   జిల్లా ఇన్‌చార్జి, సిద్దిపేట కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి

రామాయంపేట:  డీ.ధర్మారం గ్రామానికి ప్రత్యేకంగా అభివృద్ధికి నిధులు కేటాయించిన సీఎం మాటను గ్రామస్తులు నిలబెట్టాలని జిల్లా ఇన్‌చార్జి, సిద్దిపేట కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా రామాయంపేట మండలం డీ. ధర్మారం గ్రామానికి విచ్చేసిన ఇన్‌చార్జి కలెక్టర్‌ ,అదనపు కలెక్టర్‌ నగేశ్‌తో కలిసి అభివృద్ధి పనులపై జిల్లా స్థాయి అధికారులకు పలు సూచనలు సలహాలిచ్చారు.అధికారులతో కలిసి డి.ధర్మారం గ్రామానికి సీఎం వ్యక్తిగత కార్యదర్శి రాజశేఖర్‌రెడ్డి సూచనల మేరకు ప్రభుత్వం ప్రత్యేకంగా గ్రామ అభివృద్ధ్దికి రూ.2 కోట్ల నిధులను కేటాయించింది. దీంతో గ్రామంలో రూ.80లక్షలతో ఫంక్షన్‌ హాల్‌, రూ.8లక్షలు డైనింగ్‌ హాల్‌, రూ.4లక్షల గేటు, రూ.10లక్షలతో టాయిలెట్లు  మిగతా నిధులను గ్రామంలోని పైపులైన్లు,  సీసీ.రోడ్లు తదితర వాటికి సంబంధించిన స్థలాలను పరిశీలించారు.అనంతరం కలెక్టర్‌ వెంకట్రాంరెడ్డి మాట్లాడుతూ గ్రామస్తులు ఐక్యతగా ఉండి ప్రభుత్వ నిధులను ఖర్చు చేసుకోవాలన్నారు. నిధులకు కృషి చేసిన రాజశేఖర్‌రెడ్డి పేరును నిలబెట్టి రాష్ట్రంలోనే డి.ధర్మారం గ్రామాన్ని ఆదర్శంగా నిలబెట్టాలన్నారు

 పచ్చలహారం కావాలి

 గ్రామం హరితహారం మొక్కలతో పచ్చల హారం కావాలని గ్రామ సర్పంచ్‌, వార్డు సభ్యులకు, ప్రభుత్వ ఉపాధ్యాయులకు కలెక్టర్‌ సూచించారు.గ్రామంలో ఎక్కడ ఖాళీ ప్రదేశం ఉన్నా అక్కడ మొక్కలు కనిపించాలన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు హరితహారం మొక్కలతో నిండి ఉండాలని సూచించారు.

సమీకృత గొర్రెల షెడ్లు నిర్మించుకోండి

డి.ధర్మారం గ్రామంలో ఉన్న గొర్ల కాపర్లు ఒకే దగ్గర సమీకృత గొర్రెల షెడ్లు నిర్మించుకుంటే ప్రభుత్వం నిధులు కేటాయిస్తుందని కలెక్టర్‌ గొర్ల కాపర్లకు తెలిపారు. అనంతరం గ్రామంలో పనులు జరుగుతున్న శ్మశాన వాటిక వద్దకు చేరుకుని పరిశీలించారు. శ్మశాన వాటిక సల్థం అనువుగా ఉండకపోవడంతో అనువుగా ఉండే స్థలంలోనే వైకుంఠధామం నిర్మించాలని అధికారులకు సూచించారు. కలెక్టర్‌ వెంట మెదక్‌ జిల్లా అదనపు కలెక్టర్‌ నగేశ్‌, ఆర్డీవో సాయిరాం, డీఈ వెంకటేశ్వర్‌ రెడ్డి, డీపీఆర్‌వో కిరణ్‌ కుమార్‌, ఎంపీపీ నార్సింపేట భిక్షపతి, వైస్‌ ఎంపీపీ స్రవంతి సిద్ధిరాంరెడ్డి, సర్పంచ్‌ బొడ్డు శంకర్‌, తాసీల్దార్‌ శేఖర్‌రెడ్డి, ఎంపీడీవో యాదగిరిరెడ్డి, ఎంపీవో గిరిజారాణి, ఏపీవో శంకర్‌ ఉన్నారు.


logo