శనివారం 24 అక్టోబర్ 2020
Medak - Aug 26, 2020 , 23:53:26

రైతు వేదికలను త్వరగా పూర్తి యాలి

రైతు వేదికలను త్వరగా పూర్తి యాలి

మనోహరాబాద్‌ : రైతు వేదికలను త్వరితగతిన పూర్తి చేసి రైతులకు అందుబాటులోకి తేవాలని జడ్పీ చైర్‌పర్సన్‌ ర్యాకల హేమలతాశేఖర్‌గౌడ్‌ అన్నారు. మనోహరాబాద్‌ మండలం కూచారంలో నిర్మాణంలో ఉన్న రైతు వేదికను బుధవారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... రైతుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ  అన్నారు. వ్యవసాయ రంగాన్ని అన్ని విధాల అభివృద్ధి పరిచేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఇందుకోసం వ్యవసాయ మార్కెట్లు, కొనుగోలు కేంద్రాలు, ధాన్యం నిలువ కేంద్రాలను నిర్మించిందన్నారు. రైతులు తమ సమస్యల పరిష్కారానికి రైతువేదిక ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. అనంతరం దండుపల్లిలో నిర్మాణంలో వున్న వైకుంఠదామం పనులను ఆమె పరిశీలించారు. ఇదిలా ఉండగా మనోహరాబాద్‌ రైల్వేస్టేషన్‌ వద్ద రోడ్డు అస్తవ్యస్తంగా ఉందని ఉప సర్పంచ్‌ రేణుకుమార్‌ జడ్పీ చైర్‌పర్సన్‌ దృష్టికి తీసుకురావడంతో స్పందించిన ఆమె రోడ్డును చదును చేయించి మట్టి పోయించారు. దీంతో పర్కిబండ, పోతారం, గౌతోజిగూడెం గ్రామాలకు చెందిన గ్రామస్తులు ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పీఆర్‌ డిప్యూటీ ఈఈ నర్సింహులు, పీఆర్‌ ఏఈ విజయప్రకాశ్‌, ఎంపీడీవో జైపాల్‌రెడ్డి, ఏఈవో సచిన్‌, రైతుబంధు మండల కో ఆర్డినేటర్‌ సుధాకర్‌రెడ్డి, సర్పంచ్‌ నరేందర్‌రెడ్డి, ఉప సర్పంచ్‌ మహేందర్‌గౌడ్‌, నాయకులు ప్రభాకర్‌రెడ్డి, పంజా భిక్షపతి తదితరులు పాల్గొన్నారు.  


logo