మంగళవారం 20 అక్టోబర్ 2020
Medak - Aug 26, 2020 , 02:28:09

మానవ సేవే.. మాధవ సేవ

మానవ సేవే.. మాధవ సేవ

  • n కరోనాను జయించిన వైద్యులు
  • n కోలుకుని సేవలు చేస్తున్న సిబ్బంది
  • n భయం వీడండి., వైరస్‌ను దూరం చేసుకోండి
  • n కొవిడ్‌-19ను జయించిన వారి సూచన

మెదక్‌: కరోనా వైరస్‌ ప్రపంచాన్ని వణికిస్తున్నది. ఈ మహమ్మారి నుంచి ప్రజలను బయట పడేసేందుకు ఓ వైపు సైంటిస్టులు మందు కనిపెట్టే పనిలో నిమగ్నమై ఉన్నారు. మరోవైపు కొవిడ్‌-19 బారిన పడిన వారు భయంతోనే సగం క్షీణిస్తున్నారు. ప్రజలకు సేవలందించే వైద్యులు కూడా ఈ వైరస్‌ బారిన పడుతున్నారు. కానీ, వారు భయపడకుండా తగిన జాగ్రత్తలు తీసుకుని వైరస్‌ను జయించి, మళ్లీ తమ వృత్తిని కొనసాగిస్తూ ప్రజలకు తమ సేవలు అందిస్తున్నారు. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో వైద్య రంగంలో ఉండి కరోనా వైరస్‌ బారిన పడి కోలుకున్న వారు కరోనాకు భయపడవల్సిన అవసరం లేదని ధైర్యంతో దానిని ఎదుర్కోవాలని చెబుతున్నారు. 


logo