సోమవారం 19 అక్టోబర్ 2020
Medak - Aug 26, 2020 , 02:28:11

ఆలయాల్లో టెండర్లు ఖరారు

ఆలయాల్లో టెండర్లు ఖరారు

పాపన్నపేట : ఏడుపాయలలో లడ్డూ, పులిహోర, కిరాణం సరఫరా చేసేందుకు టెండర్‌ ప్రక్రియ ఖరారైంది. మంగళవారం ఏడుపాయలలో ఓపెన్‌ చేసిన ఈ ప్రొక్యూర్‌మెంట్‌ టెండర్‌ను రాజేశ్‌ కార్పొరేషన్‌ (హైదరాబాద్‌) కైవసం చేసుకున్నారు. 63 వస్తువుల కోసం సరాసరి కిలో రూ.26,895 కోడ్‌ చేశారు. ఈ నెల 14న టెండర్‌ నోటిఫికేషన్‌ విడుదల చేయగా, టెండర్‌లో ముగ్గురు పాల్గొన్నారు. అందులో తక్కువగా కోడ్‌ చేసిన రాజేశ్‌ కార్పొరేషన్‌కు టెండర్‌ దక్కినట్లు ఈవో సార శ్రీనివాస్‌ తెలిపారు. కమిషనర్‌ కార్యాలయం నుంచి ఆమోదం పొందిన తర్వాత ప్రక్రియ ప్రారంభమవుతుందని ఈవో చెప్పారు. 

‘మల్లన్న’ ఆలయంలో.. 

చేర్యాల: కొమురవెల్లి మల్లికార్జున స్వామివారి ఆలయం లో మంగళవారం ఏఈవో గంగా శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో ఆలయానికి సంబంధించిన పలు వస్తువుల సరఫరా కోసం టెండర్లు నిర్వహించారు. తక్కువ ధరలకు స్వామి వారి ఆలయానికి వస్తువులు తదితర వాటిని సరఫరా చేసేందుకు కోడ్‌ చేస్తూ టెండర్లు వేసిన వారికి ఆలయవర్గాలు ఖరారు చేశాయి. కరెంటు, ప్లంబింబ్‌ (నీటి సరఫరా), శానిటరీ సామగ్రి సరఫరా హక్కులను చేర్యాలకు చెందిన దత్తా ట్రేడర్స్‌ నిర్వాహకులు హక్కులను దక్కించుకున్నారు. కూరగాయలు, పూలు, పూలదండలు సరఫరా చేసే హక్కులను కొమురవెల్లికి చెందిన గణేశ్‌ అనే వ్యక్తి, ఫొటోలు, వీడియో చిత్రీకరణ హక్కులను కొమురవెల్లికి చెందిన సాయి డిజిటల్‌ స్టూడియో నిర్వాహకుడు వెంకట్‌రెడ్డి దక్కించుకున్నారు.   దేవాలయ షాపింగ్‌ కాంప్లెక్స్‌లో గల షెట్టర్లు నెం.2 నుంచి 20 వరకు నెలకు రూ.4వేలు, 21 నుంచి 26 వరకు గల షెట్టర్లను నెలకు ఒక్కంటికి రూ.5400ల చొప్పున వేలం పాడి పలువురు వ్యాపారులు లైసెన్స్‌ పొందారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్‌ నీల శేఖర్‌, ఆలయ సిబ్బంది ఉన్నారు.


logo