మంగళవారం 20 అక్టోబర్ 2020
Medak - Aug 24, 2020 , 00:49:58

గుణాదీతాయ.. గుణాధీశాయ..

గుణాదీతాయ.. గుణాధీశాయ..

కరోనా నేపథ్యంలో వినాయక చ వితి ఉత్సవాలను అన్ని గ్రామా ల్లో ప్రజలు శనివారం నిరాడంబరంగా నిర్వహించుకున్నారు. కరోనా నేపథ్యంలో పోలీసుల సూచన మేరకు మండపాల వద్ద  సందడి లేదు.అన్ని మ ండలల్లో ప్రజలు భక్తిశ్రద్ధల తో ఇండ్లల్లో ,ఆలయాల్లో వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించి పూజలు చేశారు.  ప్రధా న కూడళ్లలో గణనాథులు కొలువుదీరారు. మట్టి వినాయకులకు ఆదరణ పెరిగి ఎక్కువమంది కొనుగో లు చేశారు. రసాయన రంగులతో తయారు చేసిన వినాయక విగ్రహాల వల్ల కాలుష్యం పొంచి ఉండడంతో ఆ విగ్రహాలను తక్కువగా కొనుగోలు చేశారు.

పండుగను నిరాడంబరంగా నిర్వహించుకోవాలి : మున్సిపల్‌ చైర్మన్‌ 

చవితి వేడుకలను నిరాడంబరంగా నిర్వహించుకోవాలని మున్సిపల్‌ చైర్మన్‌ చంద్రపాల్‌ అన్నారు. శనివారం వినాయక చవితిని పురస్కరించుకొని మున్సిపల్‌ కార్యాలయం వద్ద గణపతి ప్రతిమలను ప్రజలకు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి పంపిన విత్తన గణపతులను కౌన్సిలర్లకు అందజేశామన్నారు.  ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీహరి, మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌, కౌన్సిలర్లు ఆకిరెడ్డి కృష్ణారెడ్డి, శ్రీనివాస్‌, రాజలింగం, సమీయొద్దీన్‌, సుంకయ్య, జయరాజ్‌, 

శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ వనిత పాల్గొన్నారు.


logo