శనివారం 31 అక్టోబర్ 2020
Medak - Aug 20, 2020 , 03:35:28

సోలిపేట సేవలు చిరస్మరణీయం

సోలిపేట సేవలు చిరస్మరణీయం

తొగుట : అధికారంలో ఉన్నా లేకున్నా ఎల్లప్పుడు ప్రజల మధ్య నే జీవించిన దివంగత ఎమ్మెల్యే రామలింగారెడ్డి సేవలు చిరస్మరణీయమని ఎంపీపీ లతానరేందర్‌రెడ్డి అన్నారు. ఎంపీపీ అధ్యక్షతన ఏర్పాటు చేసిన మండల పరిషత్‌ సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే మృతిపై సంతాపం తెలిపి మౌనం పాటించారు. అనంతరం సమావేశాన్ని వాయిదా వేశారు. సమావేశంలో ఎంపీడీవో చిన్నమున్న య్య, వైస్‌ఎంపీపీ శ్రీకాంత్‌రెడ్డి, సూపరింటెండెంట్‌ రాజిరెడ్డి, డాక్ల ర్లు వెంకటేశ్‌, రాజేందర్‌రెడ్డి, ఎంఈవో యాదవరెడ్డి, ఏవో మోహన్‌, ఎంపీటీసీ శరత్‌, కోఆప్షన్‌ సభ్యులు కలీమొద్దీన్‌, సర్పంచ్‌లు స్వామి, నర్సింహులు, చంద్రం, ప్రేమలత, రేణుక, వరలక్ష్మి పాల్గొన్నారు.