బుధవారం 28 అక్టోబర్ 2020
Medak - Aug 20, 2020 , 03:35:29

కష్టకాలంలోనూ కొనసాగుతున్న ‘సంక్షేమం ’

కష్టకాలంలోనూ కొనసాగుతున్న ‘సంక్షేమం ’

  • ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి

పాపన్నపేట : కరోనా కష్టకాలంలోనూ సీఎం కేసీఆర్‌ సంక్షేమ పథకాలను కొనసాగిస్తున్నారని ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. బుధవారం  పాపన్నపేట మంజీరా ఫంక్షన్‌హాల్‌లో బుధవారం అదనపు కలెక్టర్‌ నగేశ్‌తో కలిసి కల్యాణలక్ష్మి చెక్కులను, గ్రామపంచాయతీలకు కంప్యూటర్లను ఎమ్మెల్యే అందజేశారు.  ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ  మండలంలోని 153 మంది లబ్ధిదారులకుగాను రూ. కోటి 54లక్షలు చెక్కులను అందజేశామన్నారు. సీజనల్‌ వ్యాధులు సోకకుండా పల్లెల్లో శుభ్రతను పాటించాలన్నారు. డంపింగ్‌ యార్డులు, వైకుంఠధామాల నిర్మాణాలను త్వరితగతిన పూర్తిచేయాలన్నారు.  ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ నగేశ్‌ జడ్పీటీసీ గడీల షర్మీల, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు ప్రశాంత్‌రెడ్డి, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, సర్పంచ్‌ల ఫోరం మండల అధ్యక్షుడు కుమ్మరి జగన్‌, మండల కేంద్రం పాపన్నపేట సర్పంచ్‌ గురుమూర్తిగౌడ్‌, వైస్‌ ఎంపీపీ విష్ణువర్ధన్‌రెడ్డి, నార్సింగి సర్పంచ్‌ ప్రమీలా గోపాల్‌రెడ్డి, మల్లంపేట సర్పంచ్‌ బాపురెడ్డి, కో ఆప్షన్‌ సభ్యులు గౌస్‌, ఎంపీడీవో శ్రీనివాస్‌, ఎంపీవో లక్ష్మీకాంతరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ చెక్కుల అందజేత

మెదక్‌ టౌన్‌ :  మెదక్‌ పట్టణంలో సాయి బాలజీ గార్డెన్‌లో బుధవారం మెదక్‌ , మెదక్‌ మండలం, హవేళిఘనపూర్‌ మండలాలకు చెందిన 92 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌రెడ్డి  కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులను అందజేశారు.  ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ  మెదక్‌ , మెదక్‌ మండలానికి చెందిన 59 మందికి, హవేళిఘనపూర్‌  మండలానికి చెందిన 33 మందికి చెక్కులను అందజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ నగేశ్‌, జడ్పీవైస్‌ చైర్‌పర్సన్‌ లావణ్యరెడ్డి, చైర్మన్‌ చంద్రపాల్‌, వైస్‌చైర్మన్‌ మల్లికార్జున్‌గౌడ్‌, మెదక్‌ మండల పరిషత్‌ అధ్యక్షురాలు యమున జయరాంరెడ్డి, కమిషనర్‌ శ్రీహరి, వైస్‌ ఎంపీపీ మార్గం ఆంజనేయులు, కౌన్సిలర్‌ బట్టి లలిత, ఆర్‌కే శ్రీనివాస్‌, లక్ష్మీనారాయణ గౌడ్‌, జయరాజ్‌, సమ్మియొద్దీన్‌, కిశోర్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు కృష్ణ గౌడ్‌, ముత్యంగౌడ్‌, ఒమర్‌మొయినొద్దీన్‌, జయరాంరెడ్డి  పాల్గొన్నారు.

సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల అందజేత

పెద్దశంకరంపేట : ప్రభుత్వ పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని నారాయణఖేడ్‌ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి అన్నారు. బుధవారం నారాయణఖేడ్‌ క్యాంపు కార్యాలయంలో సీఎం రిలీఫ్‌ఫండ్‌ చెక్కులను ఇద్దరికి పంపిణీ చేశారు. మండలంలోని బూర్గుపల్లి గ్రామానికి చెందిన ఉమారాణికి రూ.12 వేలు, అదే గ్రామానికి చెందిన హనుమయ్యకు రూ.24 వేల చెక్కును అందజేశారు.  ఈకార్యక్రమంలో ఎంపీపీ జంగం శ్రీనివాస్‌, సర్పంచ్‌ సరితా మల్లేశం, నాయకులు పున్నయ్య పాల్గొన్నారు


logo