మంగళవారం 27 అక్టోబర్ 2020
Medak - Aug 19, 2020 , 02:45:30

కషాయంతో కరోనా దూరం

కషాయంతో కరోనా దూరం

  • l మెదక్‌ మున్సిపల్‌లో ఉచిత  కషాయ వితరణ కేంద్రం ప్రారంభం
  • l ఇఫ్కో డైరెక్టర్‌ దేవేందర్‌ రెడ్డి

మెదక్‌ : కషాయంతో కరోనా వైరస్‌ను దూరం చేసుకోవచ్చని టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు, ఇఫ్కో డైరెక్టర్‌ దేవేందర్‌రెడ్డి తెలిపారు. మంగళవారం మున్సిపల్‌ కార్యాలయం ఆవరణలో మెదక్‌ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి సహకారంతో ఉచిత కషాయ వితరణ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కషాయాన్ని  ప్రజలకు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లా కేంద్రమైన మెదక్‌ పట్టణంలో కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి ఉచితంగా  కాషాయ కేంద్రాన్ని ఏర్పాటు చేశారన్నారు. కషాయం సేవిస్తే రోగ నిరోధక శక్తి పెరుగుతుందని తెలిపారు. ప్రతి రోజు ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు ఉచితంగా కషాయాన్ని అందజేస్తామని తెలిపారు. కరోనా వైరస్‌ విషయంలో ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. ప్రతి ఒక్కరూ శానిటైజర్‌తో చేతులను శుభ్రం చేసుకోవాలని, మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించాలని సూచించారు. అత్యవసర సమయంలో మా త్రమే ఇంటి నుంచి బయటకు రావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ తొడుపునూరి చంద్రపాల్‌, కమిషనర్‌ శ్రీహరి, కౌన్సిలర్లు, టీఆర్‌ఎస్‌ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.

తాజావార్తలు


logo