సోమవారం 26 అక్టోబర్ 2020
Medak - Aug 18, 2020 , 00:17:03

సీఎం కేసీఆర్‌ ఆశీర్వాదం తీసుకున్న ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి

సీఎం కేసీఆర్‌ ఆశీర్వాదం తీసుకున్న ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి

  • మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు, మాజీ ఎంపీ కవిత, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల శుభాకాంక్షలు

మెదక్‌ : తన పుట్టిన రోజు సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావును సోమవారం ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత, ఉప్పల్‌ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.


logo