మంగళవారం 20 అక్టోబర్ 2020
Medak - Aug 16, 2020 , 23:04:40

హరిత గ్రామంగా తీర్చిదిద్దుకోవాలి

హరిత గ్రామంగా తీర్చిదిద్దుకోవాలి

మనోహరాబాద్‌ : హరితహారంలో నాటి ప్రతి మొక్కనూ సంరక్షించి, హరిత గ్రామంగా తీర్చిదిద్దుకోవాలని ఎమ్మెల్యే మదన్‌రెడ్డి అన్నారు. శివ్వంపేట మండలం దొంతి గ్రామంలోని హనుమాన్‌ దేవాలయం వద్ద మొక్కలు నాటి, నూతనంగా నిర్మించిన ముత్యాలమ్మ దేవాలయాన్ని ప్రారంభించి, పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అటవీశాతాన్ని పెంచడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్‌ హరితహారం కార్యక్రమాన్ని  నిర్వహిస్తున్నారన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా అనేక నిధులు మంజూరు చేసి ప్రతి గ్రామంలో మొక్కలను నాటడం జరుగుతోందన్నారు. గ్రామాన్ని శుభ్రంగా ఉంచుకోవాలని, తడి, పొడి చెత్తను వేరు చేసి పారవేయాలన్నారు. సేకరించిన చెత్తతో గ్రామ ంలో నిర్మించిన చెత్తనిర్వహణ కేంద్రం లో ఎరువుగా తయారు చేయనున్నట్లు తెలిపారు. ప్రతి ఇంటి ముందు కనీ సం ఐదు మొక్కలను నాటాలన్నారు. అనంతరం ఇటీవల మృ తి చెందిన మాజీ సర్పంచ్‌ అంజయ్య ఇంటికి వెళ్లి అతడి కుటుంబ స భ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమం లో జడ్పీ కో ఆప్షన్‌ మెంబర్‌ మ న్సూర్‌, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ చంద్రాగౌడ్‌, సర్పంచ్‌లు ఫణీశశాంక్‌ శర్మ, పూల అర్జున్‌, అశోక్‌రెడ్డి, చంద్రకళ, బాబురావు, ఎంపీటీసీ లక్ష్మీకుమార్‌, టీఆర్‌ఎస్‌ మండల పార్టీ అధ్యక్షుడు పిట్ల సత్యనారాయణ  పాల్గొన్నారు.logo