మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Medak - Aug 16, 2020 , 22:37:58

సోలిపేట కుటుంబానికి ఆత్మీయ భరోసా

సోలిపేట కుటుంబానికి ఆత్మీయ భరోసా

దుబ్బాక : శోకసంద్రంలో మునిగిన దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి కుటుంబీకులకు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు మనోధైర్యాన్ని కల్పించారు.  దు బ్బాక మండలం చిట్టాపూర్‌లో ఆదివారం  దివంగత ఎ మ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి దశదినకర్మ నిర్వహించా రు. మంత్రి హరీశ్‌రావును చూసి రామలింగారెడ్డి సతీమణి సుజాత కంట తడిపెట్టారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు ఆమెను ఓదార్చుతూ, రామలింగారెడ్డి చిత్రపటం  వేదిక వద్దకు తీసుకువచ్చి నివాళులర్పించారు. సోలిపేట కుటుంబీకులకు మంత్రి ఆత్మీయ భరోసా ఇచ్చారు. మీ ధైర్యమే లింగన్న ఆత్మకు శాంతి చేకూరుతుందన్నారు. మీ కుటుంబానికి అండగా మేమున్నామంటూ ఆయన ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో  మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, అందోల్‌, జహీరాబాద్‌, నారాయణఖేడ్‌, నర్సాపూర్‌ ఎమ్మెల్యేలు క్రాంతికిరణ్‌, మాణిక్‌రావు, భూపాల్‌రెడ్డి, మదన్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఫారుఖ్‌హుస్సేన్‌, కలెక్టర్‌, జడ్పీ అధ్యక్షురాలు, ఎఫ్‌డీసీ చైర్మన్‌ ప్రతాప్‌రెడ్డి, డీసీసీబీ చైర్మన్‌ దేవేందర్‌రెడ్డి, సిద్దిపేట మున్సిపల్‌ చైర్మన్‌ రాజనర్సు, మున్సిపల్‌ అధ్యక్షురాలు వనితాభూంరెడ్డి, నియోజకవర్గంలోని ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు, అభిమానులు పాల్గొన్నారు.


logo