మంగళవారం 20 అక్టోబర్ 2020
Medak - Aug 15, 2020 , 23:28:41

విఠలాపూర్‌లో పైపైకి పాతాళ గంగ

విఠలాపూర్‌లో పైపైకి పాతాళ గంగ

  •  బోరు బావి నుంచి  ఉబికి వస్తున్న నీళ్లు 

చిన్నకోడూరు : ఏండ్ల నుంచి సాగునీటి కోసం అరిగోస పడ్డరు.. ఉన్న భూములను సాగు చేసుకుందామని అప్పులు తెచ్చి మరీ బోర్లు తవ్వించారు. చుక్క నీరు పడక అనేక ఇబ్బందులు పడ్డారు.. ఉన్న ఊర్లో ఉపాధి కరువై ప్రజలు విదేశాలకు వలస వెళ్లారు.. కానీ, కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ప్రభు త్వం రంగనాయకసాగర్‌ నిర్మించడంతో మండలంలోని రైతుల దశ తిరిగింది. చుక్క నీరు లేక ఎండిన బోర్ల నుంచి నీరు ఉబికి వస్తున్నది. చిన్నకోడూరు మండలం విఠలాపూర్‌లో రెడ్డబోయిన కిషన్‌కి చెందిన వ్యవసాయ బోరుబావి నుంచి కరెంట్‌మోటర్‌తో నడుస్తున్న మాదిరిగా ప్రెషర్‌తో నీరు ఉబికి వస్తున్న అద్భుతం ఆవిష్కృతమైంది. దీంతో స్థానిక రైతాంగమంతా సంబురం వ్యక్తం చేసింది. ప్రభుత్వం ఇది వరకే రంగనాయకసాగర్‌ రిజర్వాయర్‌ ఎడమ కాల్వ ద్వారా మండలంలోని చెరువులు, చెక్‌డ్యాంల్లోకి నీళ్లు వదిలారు. దీనికి తోడు రెండు మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో భూగర్భ జలాలు గణనీయంగా పెరిగాయి. మా బోరు బావిలో ఎన్నడూ గిట్ల బోర్ల నుంచి నీళ్లు రాలే. కరెంట్‌ పెట్టినట్టు ప్రెషర్‌తో నీళ్లు వస్తున్నాయి అని రైతు కిషన్‌ అన్నారు. బోరు బావుల్లో భూగర్భ జలాలు పెరుగడం.. మంత్రి హరీశ్‌రావు కృషికి నిదర్శమని రైతులందరూ చెబుతూ ప్రభుత్వానికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటామన్నారు. 


logo