మంగళవారం 20 అక్టోబర్ 2020
Medak - Aug 15, 2020 , 00:27:59

మెదక్‌లో.. ఆరు ప్రాంతాల్లో

మెదక్‌లో..  ఆరు ప్రాంతాల్లో

మెదక్‌ : మెదక్‌ జిల్లాకేంద్రంలోని రాందాస్‌ చౌరస్తా, మార్కెట్‌ ప్రాంతంలో స్వచ్ఛభారత్‌, స్వచ్ఛ తెలంగాణ మరుగుదొడ్లు పూర్తయ్యాయి. మెదక్‌ పట్టణంలో ఆరు ప్రాంతాలైన మున్సిపల్‌ కాంప్లెక్స్‌, చిల్డ్రన్స్‌ పార్కు, జిల్లా కేంద్ర దవాఖాన, ఆర్‌అండ్‌బీ అతిథి గృహం, రాందాస్‌ చౌరస్తా, మార్కెట్‌ ప్రాంతాల్లో మరుగుదొడ్లను నిర్మించాలని మున్సిపల్‌ అధికారులు నిర్ణయించగా.. ఇప్పటికే రెండు ప్రాంతాల్లో పూర్తి కాగా, మరొకటి పట్టణంలోని ఐసీఐసీఐ బ్యాంక్‌ సమీపంలో పూర్తయింది. మెదక్‌ పట్టణంలో 50,800 జనాభా ఉండగా.. వెయ్యి మందికి ఒకటి చొప్పున మరుగుదొడ్డిని నిర్మిస్తున్నారు.  పట్టణంలో ఆరు కాంప్లెక్స్‌లలో మరుగుదొడ్లను నిర్మిస్తున్నారు. ఒక్కో కాంప్లెక్స్‌లో మహిళలకు ఎనిమిది, పురుషులకు 10 చొప్పున మరుగుదొడ్లను ఏర్పాటు చేయనున్నారు. కొత్తగా ఏర్పాటైన తూప్రాన్‌ మున్సిపాలిటీలో మాత్రం ఇంకా పనులు ప్రారంభం కాలేదు. నర్సాపూర్‌ బల్దియాలో 24కు గాను కొత్తగా 3 మరుగుదొడ్ల నిర్మాణం పూర్తయ్యాయి. మరొకటి పురోగతిలో ఉంది. రామాయంపేట్‌లో 17 మరుగుదొడ్ల నిర్మాణానికి గాను ఒకటి పూర్తయింది.మరొకటి పురోగతిలో ఉంది.


logo