మంగళవారం 27 అక్టోబర్ 2020
Medak - Aug 13, 2020 , 23:26:24

కోరలు చాస్తున్న కరోనా రక్కసి

కోరలు చాస్తున్న కరోనా రక్కసి

  • మెదక్‌ ఉమ్మడి జిల్లాలో పెరుగుతున్న కేసులు

మెదక్‌ : జిల్లాలో గురువారం 21 కరోనా కేసులు నమోదైనట్లు డీఎంహెచ్‌వో డాక్టర్‌ వెంకటేశ్వర్‌రావు తెలిపారు. పట్టణంలో ఎనిమిది, రామాయంపేటలో నాలుగు, కొల్చారంలో రెండు, పాపన్నపేటలో మూడు, నర్సాపూర్‌లో ఒకటి, నార్సింగిలో ఒకటి, వెల్దుర్తిలో ఒకటి, తూప్రాన్‌లో ఒకటి కరోనా కేసులు నమోదయ్యాయన్నారు. 311 మంది హోం ఐసొలేషన్‌లో ఉండగా, 15 మంది ఆయా దవాఖానల్లో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. 158 మంది కోలుకున్నారని పేర్కొన్నారు. 

సంగారెడ్డి జిల్లాలో 86 కరోనా కేసులు  

సంగారెడ్డి మున్సిపాలిటీ : జిల్లాలో గురువారం కొత్తగా 86 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు డీఎంహెచ్‌వో మోజీరాం రాథోడ్‌ తెలిపారు. జిల్లాలోని సంగారెడ్డి 18, పటాన్‌చెరు 12, అమీన్‌పూర్‌ 9, నారాయణఖేడ్‌ 8, చింతల్‌చెరు 7, బొల్లారం 4, జోగిపేట 3, బీరంగూడ 2, జహీరాబాద్‌ 2, రుద్రారం 2, సదాశివపేట 2, ఝరాసంగం 2 కేసులు నమోదు కాగా, ఇంద్రకరణ్‌, రామచంద్రాపురం, పోచారం, కొండాపూర్‌, మల్కాపూర్‌, ఇస్నాపూర్‌, నిజాంపూర్‌, బొంతపల్లి, సికిందాపూర్‌, సోలక్‌పల్లి, అన్నారం, గుమ్మడిదల, ఇటిక్యాల్‌, పెద్దారెడ్డిపేట, ఆత్మకూర్‌ గ్రామాల్లో ఒక్కటి చొప్పున మొత్తం 86 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయన్నారు. జిల్లా దవాఖానలో గురువారం 159 మంది వద్ద నుంచి ఆర్టీపీసీఆర్‌ నమూనాలను సేకరించారు. పటాన్‌చెరు ఏరియా దవాఖానలో 136 మంది వద్ద నుంచి ఆర్టీపీసీఆర్‌ నమూనాలను సేకరించినట్లు జిల్లా దవాఖాన సూపరింటెండెంట్‌ డాక్టర్‌ సంగారెడ్డి తెలిపారు. అలాగే, జిల్లాలో 379 మందికి ర్యాపిడ్‌ యాంటిజెన్‌ పరీక్షలు చేసినట్లు వైద్యాధికారులు తెలిపారు.

సిద్దిపేట జిల్లాలో 99 కరోనా కేసులు...

సిద్దిపేట కలెక్టరేట్‌ : జిల్లాలో గురువారం 99 కరోనా కేసులు నమోదయ్యాయని జిల్లా వైద్యాధికారులు తెలిపారు. చిన్నకోడూరు మండలంలో 4, దౌల్తాబాద్‌లో 1, దుబ్బాకలో 11, గజ్వేల్‌లో 7, హుస్నాబాద్‌లో 2, జగదేవ్‌పూర్‌లో 4, కోహెడలో 2, కొమురవెల్లిలో 5, మద్దూరులో 1, మిరుదొడ్డిలో 3, ములుగులో 1, నంగునూరులో 3, చేర్యాలలో 2, రాయిపోల్‌లో 1, సిద్దిపేట రూరల్‌లో 5, సిద్దిపేట అర్బన్‌లో 36, తొగుటలో 2, వర్గల్‌లో 9 కరోనా కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు. 

వర్గల్‌ మండలంలో 13 మందికి పాజిటివ్‌..

వర్గల్‌ : మండలంలోని ఆయా గ్రామాల్లో గురువారం 27 మందికి పరీక్షలు చేయగా, 13 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు ప్రభుత్వ వైద్యురాలు హరిత తెలిపారు. చౌదర్‌పల్లిలో - 2, వర్గల్‌లో -3, అంబర్‌పేటలో-1, వేలూర్‌లో - 4, గోవిందాపూర్‌లో -1, పోలీస్‌క్వార్టర్‌లో ఒకరు, గజ్వేల్‌ నుంచి వచ్చిన మరో వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు వివరించారు. వీరందరిని హోం క్వారంటైన్‌లో ఉంచి, జాగ్రత్తలు పాటించేలా  సూచనలు చేసినట్లు తెలిపారు. 

జగదేవ్‌పూర్‌ మండలంలో నలుగురికి... 

జగదేవ్‌పూర్‌ : మండల కేంద్రంలోని పీహెచ్‌సీ, తీగుల్‌ పీహెచ్‌సీ ఆధ్వర్యంలో గురువారం కొవిడ్‌ పరీక్షలు చేయగా, నలుగురికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు పీహెచ్‌సీ వైద్యులు మహేశ్‌, నివేదిత తెలిపారు. జగదేవ్‌పూర్‌ పీహెచ్‌సీ పరిధిలో ఏడుగురికి, తీగుల్‌ పీహెచ్‌సీ పరిధిలో తొమ్మిది మందికి పరీక్షలు చేసినట్లు తెలిపారు. వీరిలో జగదేవ్‌పూర్‌లో ముగ్గురు, బీజీవెంకటాపూర్‌లో ఒకరికి పాజిటివ్‌గా నిర్ధారణ అయిందన్నారు.  

మిరుదొడ్డిలో నలుగురికి..

మిరుదొడ్డి : మిరుదొడ్డి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 22 మందికి, భూంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 14 మందికి గురువారం వైద్య సిబ్బంది కరోనా పరీక్షలు చేశారు. మిరుదొడ్డిలో ఒకరికి, భూంపల్లిలో ముగ్గురికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు భూంపల్లి డాక్టర్‌ మల్లికార్జున్‌, మిరుదొడ్డి పీహెచ్‌సీ సీహెచ్‌వో లింగమూర్తి తెలిపారు. 

తొగుటలో ముగ్గురికి..

తొగుట : తొగుటలో గురువారం 25 మందికి కరోనా పరీక్షలు చేయగా,  ముగ్గురికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు డాక్టర్‌ వెంకటేశ్‌ తెలిపారు. ప్రజలు స్వీయ నిర్బంధంలో ఉండడమే మేలని, అత్యవసరమైతేనే బయటకు రావాలని సూచించారు.  logo