మంగళవారం 20 అక్టోబర్ 2020
Medak - Aug 13, 2020 , 00:23:02

100 కిలోల ఎండు గంజాయి పట్టివేత

100 కిలోల ఎండు గంజాయి పట్టివేత

  •  ఇద్దరు నిందితులకు రిమాండ్‌

సిర్గాపూర్‌ : అక్రమంగా తరలిస్తున్న 100 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకొని, ఇద్దరి నిందితులను పోలీసులు పట్టుకొని బుధవారం సాయంత్రం రిమాండ్‌కు పంపించారు. ఎస్సై మొగులయ్య వివరాల ప్రకారం.. మండలంలోని కడ్పల్‌ శివారులో తమ సిబ్బందితో వాహనాలను తనిఖీ చేస్తున్న క్రమంలో కారులో గంజాయి ప్యాకెట్లు లభ్యమయ్యాయి. కారు డ్రైవర్‌ పరారీ కావడంతో, మరో ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారించగా, పెద్ద శంకరంపేట నుంచి సిర్గాపూర్‌ మండలం కడ్పల్‌ నుంచి కంగ్టి మీదుగా కర్ణాటకకు 50ఎండు గంజాయి ప్యాకెట్లు (100 కిలోలు) కారులో రవాణా చేస్తున్నట్లు పేర్కొన్నారు. నిందితులను అరెస్టు చేసి, వారి నుంచి కారు, రెండు బైక్‌లను సీజ్‌ చేశారు. అనంతరం నిందితులను నారాయణఖేడ్‌ మున్సిఫ్‌ కోర్టులో హాజరుపరిచినట్లు ఎస్సై తెలిపారు. ఇందులో ఖేడ్‌ సీఐ రవీందర్‌రెడ్డి, కల్హేర్‌ ఎస్సై వెంకట్‌రెడ్డి, ఏఎస్సై విశ్వనాథ్‌, విజయ్‌కుమార్‌, శివకుమార్‌, ప్రవీణ్‌ ఉన్నారు. 


logo