బుధవారం 28 అక్టోబర్ 2020
Medak - Aug 12, 2020 , 02:55:47

ఘనంగా శ్రీకృష్ణాష్టమి

ఘనంగా శ్రీకృష్ణాష్టమి

కేశవుడి పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో మంగళవారం గోకులాష్టమిని ఉత్సాహంగా జరుపుకొన్నారు. పాఠశాలలకు సెలవులు ఉండడంతో ముంగిళ్లల్లోనే శ్రీ కృష్ణుల సందడి కనిపించింది. ప్రస్తుతం లాక్‌డౌన్‌ ఉండడంతో ఇంట్లో తల్లిదండ్రులు కూడా చిన్నారులను ఎంతో ముచ్చటగా రాధాకృష్ణులుగా అలంకరించారు. పలుచోట్ల నల్లనయ్య సేవలో ఉన్న భక్తులు ఉట్టి కొట్టించారు. జిల్లాలోని శ్రీకృష్ణ దేవాలయాల్లో కృష్ణాష్టమి సందర్భంగా భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

- ఉమ్మడి మెదక్‌ జిల్లా, నెట్‌వర్క్‌


logo