సోమవారం 19 అక్టోబర్ 2020
Medak - Aug 12, 2020 , 02:55:47

జలధార

జలధార

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రెండు రోజులుగా ఎడతెరిపిలేకుండా వర్షం కురిసింది. దీంతో చెరువులు, కుంటలు మత్తడి పోస్తున్నాయి. జలాశయాలకు భారీగా వరద నీరు పోటెత్తుతోంది. సింగూరు ప్రాజెక్టులో నీరు చేరుతుండగా, జహీరాబాద్‌ మండలంలోని నారింజ ప్రాజెక్టు వరద నీటితో నిండుకుండలా మారింది. కోహెడ మండల పరిధిలోని బస్వాపూర్‌ వాగు, సింగరాయ లొద్దులో చెక్‌డ్యామ్‌లు మత్తడులు దుంకుతున్నాయి. దీంతో పలు చోట్ల మత్స్యకారులు చేపలు పడుతూ సందడి చేశారు.

- ఉమ్మడి మెదక్‌ జిల్లా, నెట్‌వర్క్‌

వనదుర్గా భవానీ ప్రాజెక్టు .. నిర్ణయం తీసుకున్న సీఎం కేసీఆర్‌ 

మెదక్‌ జిల్లాలోని మధ్యతరహా నీటిపారుదల ప్రాజెక్టు ఘనపూర్‌ పేరును వనదుర్గా భవానీ ప్రాజెక్టుగా నామకరణం చేయాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించినట్లు తెలిసింది. రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులపై మంగళవారం ప్రగతిభవన్‌లో నీటిపారుదల శాఖ అధికారులు, మంత్రులతో నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఏడుపాయల్లో సుమారు 115 ఏండ్ల క్రితం నిర్మించిన ఘనపురం ప్రాజెక్టు పేరును ఇకపై వనదుర్గా భవానీ ప్రాజెక్టుగా పిలువనున్నారు. ప్రాజెక్టు పేరు మార్పుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంపై ఎమ్మెల్సీ, సీఎం కేసీఆర్‌ రాజకీయ కార్యదర్శి శేరి సుభాష్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.ఈ మేరకు మంగళవారం ఆయన సీఎంను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. - మెదక్‌  logo