శనివారం 31 అక్టోబర్ 2020
Medak - Aug 09, 2020 , 23:51:29

నిరుపేదల సొంతింటి కల సాకారం

నిరుపేదల సొంతింటి కల సాకారం

తూప్రాన్‌ రూరల్‌: తూప్రాన్‌ పట్టణంలో ఎన్నో ఏండ్లుగా ఎదు రుచూస్తున్న ఇండ్లులేని నిరుపేదల చిరకాలవాంఛ త్వరలో నెరవేరబోతున్నది. పట్టణంలో 50 పడకల దవాఖానను ప్రా రంభించేందుకు 2017లో సీఎం కేసీఆర్‌ తూప్రాన్‌ వచ్చిన సందర్భంగా పట్టణానికి 500 డబుల్‌ బెడ్రూం ఇండ్లు మం జూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇందు కోసం రూ. 25.20 కోట్లను కేటాయిస్తున్నట్లు పేర్కొన్నారు.  డబుల్‌ బెడ్రూం ఇండ్ల నిర్మాణానికి కావాల్సిన  అనువైన స్థలం అం దుబాటులో లేకపోవడంతో నిర్మాణం పనుల్లో జాప్యం జరిగింది. సీఎం  కేసీఆర్‌, మంత్రి హరీశ్‌రావుల ప్రత్యేక చొరవతో  ఆర్డీవో శ్యాంప్రకాశ్‌, తహసీల్దార్‌ శ్రీదేవి, రెవెన్యూ సిబ్బంది ఎంపీడీవో కార్యాలయం సమీపంలో డబుల్‌ బెడ్రూం ఇం డ్లకు స్థలం కేటాయించారు. వీటి నిర్మాణాలు చకచకా సాగు తూ పనులు చివరి దశలో ఉన్నాయి.

మంత్రి   ఆదేశాలతో కదిలిన అధికారులు..

 ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు ఆదేశాలతో అధికార యంత్రాంగం కదిలింది. ఇటీవలే తూప్రాన్‌లో పర్యటించిన ఆయన మున్సిపల్‌ పాలకవర్గం, ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి డబుల్‌ బెడ్రూం ఇండ్ల నిర్మాణం పనులను త్వరితగతిన పూర్తి చేసి దసరా పండుగ రోజు ఇండ్లులేని నిరుపేదలు గృహ ప్రవేశాలు చేసేవిధంగా అధికారులు, సం బంధిత కాంట్రాక్టర్లు కృషి చేయాలని, లేకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆలోపే ఇండ్లులేని నిరుపేదల నుంచి దరఖాస్తులు స్వీకరించే కార్యక్రమాన్ని పూర్తి చేయాలని మున్సిపల్‌ చైర్మన్‌ రాఘవేందర్‌గౌడ్‌, ఆర్డీవో, తహసీల్దార్‌లకు సూచించారు. 

 1,537  దరఖాస్తులు..

డబుల్‌ బెడ్రూం ఇండ్ల కేటాయింపు, లబ్ధిదారుల ఎంపికకు తూప్రాన్‌ పట్టణంలో అర్హులైన ఇండ్లులేని నిరుపేదల నుంచి దరఖాస్తులు స్వీకరించే ప్రక్రియ శుక్రవారం సాయంత్రంతో పూర్తయింది. మున్సిపాలిటీ  పరిధిలోని తూప్రాన్‌, రావెళ్లి, పోతరాజుపల్లి, అల్లాపూర్‌, బ్రాహ్మణపల్లి, పడాల్‌పల్లి తదితర గ్రామాల నుంచి 1,537 మంది నిరుపేదలు దరఖాస్తు  చేసుకున్నారు.  ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు ఆదేశాల మేరకు  మున్సిపల్‌ చైర్మన్‌ రాఘవేందర్‌గౌడ్‌ సూచనతో ఆర్డీవో  , తహసీల్దార్‌ పర్యవేక్షణలో ప్రణాళికాబద్ధంగా కౌంటర్లను ఏర్పాటు చేశారు. పట్టణంలో 16 వార్డులుండగా, స్థానిక జడ్పీహెచ్‌ఎస్‌ బాలురు, బాలికల పాఠశాలల్లో 4 వంతున 8 కౌంటర్లు ఏర్పాటు చేశారు. ప్రతి కౌంటర్‌లో రెండు వార్డులకు చెందిన నిరుపేదల నుంచి రెవెన్యూ అధికారులు దరఖాస్తులు స్వీకరించారు. వార్డుల వారీగా పరిశీలిస్తే ఒకటో వార్డులో 84, 2వ వార్డులో 153, 3వ వార్డులో 174, 4వ వార్డులో 107, 5వ వార్డులో 80, 6వ వార్డులో 51, 7వ వార్డులో 52, 8వ వార్డులో 91, 9వ వార్డులో 70, 10వ వార్డులో 93, 11వ వార్డులో 78,12వ వార్డులో 75, 13వ వార్డులో 121,14వ వార్డులో 98,15వ వార్డులో 124, 16వ వార్డులో 86 మంది డబుల్‌ బెడ్రూం ఇండ్లకు దరఖాస్తు చేసుకున్నారు.

కఠిన నిబంధనలతో వెనక్కి తగ్గిన అనర్హులు

డబుల్‌ బెడ్రూం ఇండ్ల కోసం చాలామంది దరఖాస్తు చేసుకోవాలని ముందే నిర్ణయించుకున్నారు. అర్హులైన వారికే డబుల్‌ బెడ్రూం ఇండ్లు కేటాయిస్తామని, దరఖాస్తు పత్రాలు సైతం అధికారులే ఉచితంగా అందజేస్తారని, విచారణలో వాస్తవం తేలకపోతే చట్టపరంగా శిక్షార్హులవుతారని మున్సిపల్‌ చైర్మన్‌ రాఘవేందర్‌గౌడ్‌ హెచ్చరికలు జారీ చేయడంతో దరఖాస్తు చేసుకునేందుకు అనర్హులు వెనక్కి తగ్గారు. మున్సిపల్‌ పరిధిలోని 16 వార్డులనుంచి కనీసం 3 వేలకు తగ్గకుండా దరఖాస్తులు వస్తాయని భావించినప్పటికీ 1,537 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు.