శనివారం 31 అక్టోబర్ 2020
Medak - Aug 08, 2020 , 23:48:56

సంగారెడ్డి జిల్లాలో మరో 92 కరోనా పాజిటివ్‌ కేసులు

సంగారెడ్డి జిల్లాలో మరో 92 కరోనా పాజిటివ్‌ కేసులు

సంగారెడ్డి మున్సిపాలిటీ: సంగారెడ్డి జిల్లాలో కొత్తగా 92 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని డీఎంహెచ్‌వో డాక్టర్‌ మోజీరాం రాథోడ్‌ శనివారం తెలిపారు.  ఇందులో 82 మంది హోం ఐసొలేషన్‌, ప్రభుత్వ దవాఖానల్లో  5 మంది, ప్రైవేట్‌ దవాఖానల్లో నలుగురు చికిత్స పొందుతున్నారని తెలిపారు. సంగారెడ్డి పట్టణంలో  (67) కరోనాతో మృతి చెందిందని డీఎంహెచ్‌వో తెలిపారు. 

జిల్లాలో ఆర్‌టీపీసీఆర్‌ నమూనాల సేకరణ..

సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ దవాఖానలో 257 మంది నుంచి ఆర్‌టీపీసీఆర్‌ నమూనాలు సేకరించినట్లు జిల్లా దవాఖాన సూపరింటెండెంట్‌ డాక్టర్‌ సంగారెడ్డి తెలిపారు.

మెదక్‌ జిల్లాలో 21 కేసులు నమోదు

మెదక్‌ : మెదక్‌ జిల్లాలో శనివారం 21 కేసులు నమోదు కాగా, జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 375 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని డీఎంహెచ్‌వో డాక్టర్‌ వెం కటేశ్వర్‌రావు తెలిపారు. మెదక్‌లో ఒకరికి, నర్సాపూర్‌లో ఐదుగురికి, రామాయంపేటలో ఒకరికి, పెద్దశంకరంపేటలో ఒకరికి, చిన్నశంకరంపేటలో నలుగురికి, సర్ధనలో ముగ్గురికి, పొడ్చన్‌పల్లిలో ఇద్దరికి, పాపన్నపేటలో ఒకరికి, గడిపెద్దాపూర్‌లో ఒకరికి, కౌడిపల్లిలో ఒకరికి పాజిటివ్‌ వచ్చింది. 

తొగుటలో ఐదుగురికి పాజిటివ్‌

తొగుట: తొగుట పీహెచ్‌సీలో శనివారం 25 మందికి కరోనా ర్యాపిడ్‌ యాంటిజెన్‌ పరీక్షలు నిర్వహించగా, ఐదుగురుకి  పాజిటివ్‌ వచ్చిందని వైద్యుడు వెంకటేశం తెలిపారు.

కొండపాలలో 9 మందికి.. 

కొండపాక: కుకునూర్‌పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో శనివారం 56మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, 9మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని వైద్య సిబ్బంది తెలిపారు. కుకునూర్‌పల్లి పీహెచ్‌సీలో 33మందికి పరీక్షలు చేయగా, ఆరుగురికి, కొండపాక పీహెచ్‌సీలో 23 మందికి చేయగా, ముగ్గురికి పాజిటివ్‌  వచ్చింది. 

మద్దూరులో కరోనా పరీక్షలు

మద్దూరు: మద్దూరు, లద్నూరు ప్రాథమిక ఆరోగ్య కేం ద్రాల్లో శనివారం 40 మందికి కరోనా పరీక్షలు చేశారు. లద్నూర్‌ పీహెచ్‌సీ పరిధిలో 25 మందికి పరీక్షలు చేయగా, ముగ్గురికి పాజిటివ్‌ వచ్చిందని వైద్యాధికారి సుధా తెలిపారు. మద్దూరు పీహెచ్‌సీ పరిధిలో 15 మందికి పరీక్షలు చేయగా, అందరికీ నెగెటివ్‌ వచ్చిందని వైద్యాధికారి రాజు తెలిపారు. రెండు పీహెచ్‌సీల పరిధిలో ఇప్పటి వరకు 62 మందికి ర్యాపిడ్‌ టెస్టులు చేయగా, ఐదుగిరికి  పాజిటివ్‌ వచ్చింది.