బుధవారం 28 అక్టోబర్ 2020
Medak - Aug 08, 2020 , 23:03:04

వల్లూర్‌ అటవీ ప్రాంతంలో చిరుత సంచారం

వల్లూర్‌ అటవీ ప్రాంతంలో చిరుత సంచారం

చేగుంట: మండల పరిధిలోని వల్లూర్‌, కామారం సరిహద్దు ఆటవీ ప్రాంతంలో రెండు చిరుతలు సంతరిస్తుండడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. స్థానికులు వెంటనే ఫారెస్టు అధికారులకు సమాచారం ఇవ్వడంతో మెదక్‌ డీఎఫ్‌వో ఆదేశాలతో చిరుత సంచరిస్తున్న ప్రాంతంలో ఓ బోనును ఏర్పాటు చేశారు. రెండు రోజుల కింద కుక్కల అరుపులు చేయడాన్ని గమనించిన స్థానికులు వెం టనే ఫారెస్టు అధికారులకు సమాచారం ఇచ్చారు. ఫారెస్టు సెక్షన్‌ ఆఫీసర్‌ బల్‌రాం తమ సిబ్బందితో కలిసి అక్కడికి వెళ్లి చూడగా, కొంత దూరంలో ఉన్న నెముల్ల గుట్ట ఆటవీ ప్రాంతంలోని పెద్ద బండరాయిపై చిరుత కూర్చున్నట్లు గుర్తించారు. వెంటనే టార్చిలైట్లు వేసి అరుపులు చేయడంతో అక్కడి నుంచి చిరుత వెళ్లిపోయింది.  శుక్రవారం రాత్రి కనిపించిన చిరుత 25 కిలోల వరకు బరువు ఉంటుందని, వారం రోజుల కింద కనిపించిన చిరుత 50కిలోలకు పైగా ఉంటుందని ఫారెస్టు అధికారులు తెలిపారు. 15రోజుల కింద రామాయంపేట అటవీ ప్రాంతంలో ఒక దూడపై చిరుత దాడి చేయగా, కాట్రియాల్‌లో మరో ఆవుపై దాడి చేసి చంపిందన్నారు. 

చిరుతను బంధించేందుకు బోను ఏర్పాటు

చిన్నశంకరంపేట: వల్లూర్‌ అటవీ ప్రాంతంలో చిరుతపులి సంచరిస్తుండటంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భయాం దోళనకు గురవుతున్నారు. కామారం గిరిజన తండా ప్రాం తంలో చిరుతను బంధించేందుకు బోను ఏర్పాటు చేశారు.   


logo